
📌 Key Points
- రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్.. జస్కిరత్, హమ్జాగా అదరగొట్టనున్నాడు!
- విలన్‌గా అర్జున్ రాంపాల్.. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో విధ్వంసం సృష్టించనున్నాడు!
- ఉగాది కానుకగా మార్చి 19న ధురంధర్ 2 థియేటర్లలో విడుదల!
- జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మాణంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్!
‘ధురంధర్: ది రివెంజ్’ సీక్వెల్ వచ్చేసింది! రణవీర్ సింగ్ మరోసారి తన యాక్షన్ విశ్వరూపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ అదుర్స్!
సిని ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతోండగా ఆడియన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇందులోనుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఇందులో భాగంగానే తాజాగా ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ పాత్రలో మరోసారి తీవ్రతతో కనిపించారు. ఈసారి ఆయన జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కథలో కీలక పాత్రలుగా ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో భయంకరమైన విలన్‌గా, అలాగే సంజయ్ దత్ ఎస్‌పీ చౌధరి అస్లంగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాలు, పదునైన డైలాగ్స్, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ విజిల్స్ వచ్చేలా చేసే సన్నివేశాలతో ట్రైలర్ మొత్తం ఒక భారీ రివెంజ్ సాగాకు నాంది పలుకుతోంది. కాగా.. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 19న ఉగాది పండుగల సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
విలన్‌గా అర్జున్ రాంపాల్ అరాచకం!
ఉగాదికి థియేటర్లలో ధురంధర్ 2 రచ్చ!
ధురంధర్ 2 ట్రైలర్ ఒక ఊపు ఊపేసింది. మార్చి 19న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


