|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్’లో యలీనా నిజ స్వరూపం బట్టబయలు! అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

Published: 23-03-2026, 2:35 AM
షాకింగ్: ‘ధురంధర్’లో యలీనా నిజ స్వరూపం బట్టబయలు! అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
  • ‘ధురంధర్’ సినిమాలోని యలీనా జమాలీ పాత్ర నిజ జీవితంలోని వ్యక్తి ఆధారంగా రూపొందిందా అనే చర్చ జరుగుతోంది.
  • యలీనా పాత్రను పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబీల్ గబోల్ కుమార్తెతో పోలుస్తున్నారు.
  • నబీల్ గబోల్‌కు నిజానికి కూతురు లేరని తేలడంతో అసలు ట్విస్ట్ బయటపడింది.
  • ఈ సినిమాలో పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల అంశాలను చూపించారు.

‘ధురంధర్’ సినిమాలోని యలీనా జమాలీ పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాత్ర నిజ జీవితంలోని వ్యక్తి ఆధారంగా రూపొందిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

యలీనా జమాలీ పాత్ర నిజమా?

Dhurandhar : ధురంధర్.. హిందీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేడు ప్రపంచ దేశాలను మెప్పిస్తున్న ఈ సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఉరి లాంటి చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ (Adityadhar)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ధురంధర్ : ది రివేంజ్’ పేరిట మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా కూడా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల జోరు చూపిస్తుంటే అందులోని క్యారెక్టర్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందులో చూపించిన పాత్రలు కల్పితమా? లేక నిజమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇందులోని విషయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో 20 ఏళ్ల సారా అర్జున్ (Sara Arjun) పోషించిన యలీనా జమాలీ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాత్ర వెనుక ఉన్న అసలు నిజానిజాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. విషయంలోకి వెళ్తే.. ధురంధర్ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఒక యాక్షన్ థ్రిల్లర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్లోని ల్యారీ ప్రాంతం భారత్ పై జరిగిన ఉగ్రదాడులు వంటి అంశాలను ఇందులో చూపించారు. అయితే ఈ సినిమాలో చూపించిన క్యారెక్టర్లు కూడా నిజ జీవిత వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినవే కావడంతో అటు యలీనా జమాలీ పాత్ర పై కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది..

నబీల్ గబోల్‌తో యలీనాకు సంబంధం?

ఇకపోతే ఈ సినిమాలో జమీల్ జమాలీ క్యారెక్టర్ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబీల్ గబోల్ ఆధారంగా రూపొందించబడిందనే ప్రచారం సాగుతోంది. దీంతో సినిమాలో చూపించినట్లుగా జమాలీ కూతురు యలీనాకు నిజంగానే ఒక భారత గూడచారితో వివాహం జరిగిందా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే విషయాలపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.. ఇక ఈ పాత్రను పాక్ రాజకీయ నేత నబీల్ కూతురితో ముడి పెడుతూ సోషల్ మీడియాలో అనేక థియరీలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. పాకిస్తాన్ నేత నబీల్ గబోల్ కు అసలు కూతురే లేకపోవడం గమనార్హం.

ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. కానీ మహీన్ గబోల్, నాడియా గబోల్ అనే ఇద్దరు మహిళల పేర్లు చర్చల్లోకి వచ్చినా ఇందులో నాడియా గబోల్ నబీల్ గబోల్ అన్న కూతురు.. ఈమె ఒక సామాజిక కార్యకర్తగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక మరో మహిళ మహీన్ గబోల్ పై ఇప్పుడు రకరకాల ప్రచారాలు తెరపై వినిపిస్తున్నాయి. ఈమె రెహమాన్ డకైత్ సోదరుడు ఉజైర్ తో సంబంధం కలిగి ఉందని, ఆ ఉజైర్ పై ఇండియన్ స్పై అనే అనుమానం ఉండేదని కొందరు వాదిస్తుంటారు. అయితే ఈ గొడవ తర్వాత నబీల్ ఆమెను కువైట్ పంపించేశారని కూడా అంటారు. కానీ దీనిపై ఎటువంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం.

ట్విస్ట్: గబోల్‌కు కూతురే లేరు!

అయితే మరొకవైపు ఈ సినిమాలో తన కుటుంబాన్ని చూపించిన విధానం పై పాక్ రాజకీయ నేత స్వయంగా స్పందించారు. తన కూతురికి ఒక భారతీయ గూడచారితో వివాహం జరిగినట్లు చూపించడంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. సినిమా ఆసక్తికరంగా ఉండడానికి కల్పిత కథలు సృష్టించారని ఆయన కొట్టిపారేశారు. ఏది ఏమైనా ఈ సినిమాలోని యలీనా పాత్ర వెండితెరపై అద్భుతమే అయినా.. ఆమె పాత్ర వెనుక ఉన్న కథ కేవలం కల్పితమే అని స్పష్టమవుతోంది.

చివరిగా, ‘ధురంధర్’ సినిమాలోని పాత్రల గురించిన చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా యలీనా పాత్ర నిజమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.