|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ధురంధర్’ ఓటీటీ రైట్స్ రికార్డుల విధ్వంసం.. ఎన్ని కోట్లంటే షాక్ అవుతారు!

Published: 24-12-2025, 1:32 AM
‘ధురంధర్’ ఓటీటీ రైట్స్ రికార్డుల విధ్వంసం.. ఎన్ని కోట్లంటే షాక్ అవుతారు!
  • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 905 కోట్లు వసూలు.
  • త్వరలో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరనున్న స్పై థ్రిల్లర్.
  • నెట్‌ఫ్లిక్స్‌కు రూ. 285 కోట్లకు ఓటీటీ రైట్స్ విక్రయం.
  • జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, రూ. 905 కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువైన ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 285 కోట్లకు కొనుగోలు చేసింది. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ధురంధర్ బాక్సాఫీస్ సునామీ

రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), ఆదిత్య ధర్(Aditya Dhar) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar). అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటికీ నుంచి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. సినీ ప్రముఖ ప్రశంసలు పొందడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ.. రికార్డులు కొల్లగొడుతోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 207. 25 కోట్లు కొల్లగొట్టి.. రెండో వారంలోనూ అదే వేగాన్ని కొనసాగించింది. రెండో వారంలో ఏకంగా రూ. 253కోట్లు వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ సినిమా అయినా రెండో వారినే కాస్త కలెక్షన్లు తగ్గుతాయి.

కానీ ‘ధురంధర్’ మాత్రం అదే ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడో వారంలోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టి ‘పుష్ప-2’ రికార్డు‌ను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ‘ధురంధర్’ వరల్డ్ వైడ్‌గా రూ. 905 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వేయి కోట్ల క్లబ్ చేరేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ధురంధర్’ ఘన విజయం సాధించడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 285 కోట్లకు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్.

ఓటీటీ రైట్స్‌కు భారీ ధర

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించి, ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉంది. ఈ విజయం చిత్ర బృందానికి గొప్ప మైలురాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.