|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నానితో సినిమా చేసేందుకు టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆసక్తి! కాంబినేషన్ కుదిరేనా?

Published: 30-01-2026, 12:35 PM
నానితో సినిమా చేసేందుకు టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆసక్తి! కాంబినేషన్ కుదిరేనా?
  • టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా ఎదిగిన అభిషన్ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు.
  • నానితో సినిమా తీయాలని ఉందని అభిషన్ తన మనసులోని కోరికను బయటపెట్టారు.
  • నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నారు.
  • నాని కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు, అభిషన్ కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే, నానితో సినిమా తీయాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

నానితో సినిమా చేయాలనీ ఉంది అన్న అభిషన్

Abhishan Jeevinth: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు తమిళ భాషలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ద్వారా దర్శకుడు అభిషన్ (Abishan)కూడా ఇండస్ట్రీలో అదే విధంగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అతి త్వరలోనే వెండితెరపై హీరోగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అభిషన్, అనస్వర రాజన్ (Anaswara Rajan)హీరో హీరోయిన్లుగా” విత్ లవ్” (With Love)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు అభిషన్ కు మీడియా వారి నుంచి వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి ఇప్పటివరకు తమిళ సినిమాలు చేసిన ఈయన తన సినిమాలను తెలుగులో విడుదల చేయడంతో ఇక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. ఒకవేళ తెలుగులో కనుక స్ట్రైయిట్ సినిమా చేస్తే ఏ హీరోతో సినిమా చేస్తారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అభిషన్ సమాధానం చెబుతూ హీరో నాని(Nani)తో సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

హీరోగా పరిచయం కాబోతున్న అభిషన్

ఇలా నానితో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసే ఆలోచనలో అభిషన్ ఉన్నారనే విషయం తెలిసిన నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో కనక సినిమా సెట్ అయితే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక కొత్తవారిని ప్రోత్సహించడంలో నాని ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంతోమంది దర్శకులను అలాగే సెలబ్రిటీలను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరి నానితో సినిమా చేయాలని ముచ్చట పడుతున్న ఈ యువ దర్శకుడికి నాని అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక నాని కూడా ప్రస్తుతం కెరియర్ పరంగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా మూవీతో నాని బిజీ

మొత్తానికి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అభిషన్ నానితో సినిమా తీస్తాననడం హాట్ టాపిక్ గా మారింది. నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.