
📌 Key Points
- డైరెక్టర్ వశిష్ట టాలెంట్: కొడుకులకు కథలు చెప్పి తండ్రులతో సినిమాలు తీసే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు!
- మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్న వశిష్ట.. బాలయ్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్!
- బాలయ్య కోసం వశిష్ట రాసిన కథ మోక్షజ్ఞకు నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ మారింది.. ఇది ఊహించని ట్విస్ట్!
- రామ్ చరణ్ కోసం మొదట కథ రాసి చిరుతో ‘విశ్వంభర’.. వశిష్ట సక్సెస్ వెనుక ఆసక్తికర కథనాలు!
టాలీవుడ్‌లో ఒక సంచలనం! డైరెక్టర్ వశిష్ట కొడుకులకు కథలు చెప్పి తండ్రులతో సినిమాలు చేసే ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
వశిష్ట మార్క్: కొడుకులకు కథ, తండ్రులతో సినిమా!
ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వశిష్ట మొదట నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే నటుడుగా విఫలమైన వశిష్ట.. డైరెక్టర్‌గా మాత్రం మొదటి చిత్రం ‘బింబిసార’తోనే బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక హిట్ కొట్టాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. రిలీజ్‌పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి చిత్రం తర్వాత ఈ డైరెక్టర్ నటసింహం బాలయ్యతో ఓ ప్రాజెక్టు లైన్‌లో పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
అయితే.. నిజానికి ఈ డైరెక్టర్ ఫస్ట్ మోక్షజ్ఞ కోసం కథ రాసుకుని.. ఆ కథను వినిపించేదుకు వెళ్లారట. ఆ ప్రోసెస్‌లో బాలయ్యకు కూడా ఓ కథ చెప్పారని తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి, బాలయ్య ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లబోతున్నాడట మన డైరెక్టర్. ఇక ‘విశ్వంభర’లోనే ఇదే జరిగింది. మొదట రామ్ చరణ్ కోసం ఆయన కథ రాసుకుని.. చరణ్‌కి వినిపిస్తే ఆయన కూడా ఓకే చేశారట. కానీ ఆ ప్రయాణంలో చిరుకి ఓ కథ చెప్పడం.. విశ్వంభర టేకాఫ్ అవ్వడం జరిగాయి. దీంతో ఇదేం ట్రెండ్ వశిష్ట.. కొడుకులకు కథ చెప్పడానికి వెళ్లి తండ్రులను లైన్‌లో పెట్టావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు.
చిరుతో ‘విశ్వంభర’.. బాలయ్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్!
మోక్షజ్ఞ కథ మిస్.. బాలయ్యతో సినిమా ఫిక్స్!
వశిష్ట టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఆయన రాబోయే ప్రాజెక్టుల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం.


