
📌 Key Points
- దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.
- మాధురికి ఇదివరకే మహేష్ చంద్రబోస్‌తో వివాహం జరిగింది, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
- దువ్వాడ శ్రీనివాస్‌కు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు.
- పిల్లల బాధ్యత తామే తీసుకుంటామని, మరో తరం కోసం వారసుడిని కనాలని ఉందని మాధురి తెలిపారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. మాధురికి ఇదివరకే వివాహం జరిగింది, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
దువ్వాడ శ్రీనివాస్, మాధురిల పెళ్లి ప్రకటన
Divvala Madhuri: రాజకీయాలు కాస్త ఫాలో అవుతున్నవారికి దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) , దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రముఖ పార్టీకి చెందిన నేత. ఇక ఈయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన మొదటి భార్య వాణి(Vani)కి విడాకులు ఇచ్చి ప్రస్తుతం దివ్వెల మాధురితో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
దువ్వాడ శ్రీనివాస తన భార్య వాణితో గొడవలు అనంతరం పూర్తిగా మాధురి వద్దే ఉంటూ రాజకీయ కార్యకలాపాలలో బిజీ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరూ పెళ్లి పిల్లల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దివ్వల మాధురికి ఇదివరకే మహేష్ చంద్రబోస్(Mahesh Chandrabose) అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు నెలకు 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానం. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ దంపతులకు కూడా ఇద్దరు అమ్మాయిలు. వీరిద్దరూ తమ జీవిత భాగస్వామిల నుంచి వేరుగా వచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
మాధురి మొదటి భర్త స్పందన
ఇలా దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి గురించి తన భర్త తనకు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని తెలిపారు. ప్రస్తుతం కొద్దిగా బిజినెస్ వ్యవహారాలు కోర్టు వివాదాల కారణంగా తాము పెళ్లి చేసుకోవట్లేదని, త్వరలోనే పెళ్లి చేసుకుని వారుసుడిని పరిచయం చేస్తాము అంటూ మాధురి తెలిపారు. ఇక తన ముగ్గురు పిల్లలు కూడా తన మొదటి భర్త వద్ద ఉంటున్నారని తరచు తాను కూడా వారి వద్దకు వెళ్లి వస్తుంటాను. ఇకపై తన పిల్లలను తనతో పాటు హైదరాబాదులో పెంచుకుంటానని మాధురి తెలిపారు. పిల్లలకు దువ్వాడ శ్రీనివాస్ సపోర్ట్ పూర్తిగా ఉందని ఈమె తెలియజేశారు.
అయిదుగురు పిల్లల బాధ్యత మాదే..
పిల్లల భవిష్యత్తు గురించి మాధురి
ఇక నాకు ముగ్గురు అమ్మాయిలు అలాగే శ్రీను గారికి ఇద్దరు అమ్మాయిలు అందుకే మేము మరో జనరేషన్ కి దువ్వాడ లాంటి లీడర్ అవసరం అన్న ఉద్దేశంతోనే వారసుడికి జన్మని ఇవ్వాలనుకుంటున్నామంటూ మాధురి మాట్లాడారు. ఇక తన పిల్లలతోపాటు శ్రీనివాస్ ఇద్దరి అమ్మాయిల బాధ్యతలు కూడా మేము తీసుకున్నామని తెలిపారు. ఎంతోమంది ప్రజలు బాధ్యతలు తీసుకున్న మేము మా పిల్లల బాధ్యతలను ఎందుకు పట్టించుకోము పెద్దమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరిగింది రెండో అమ్మాయికి తండ్రిగా శ్రీనివాస్ గారు చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నారని మాధురి ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి గురించి తన మొదటి భర్త గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ల వివాహం త్వరలో జరగనుంది. వారిద్దరూ పిల్లల బాధ్యత తీసుకుంటామని, రాజకీయ భవిష్యత్తు కోసం వారసుడిని కనాలని అనుకుంటున్నామని తెలిపారు.


