
📌 Key Points
- జీ5లో విడుదలైన ‘D/O ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్.
- రాజీవ్ కనకాల, ఉదయభాను, గాయత్రి భార్గవిల నటన అద్భుతం!
- కూతురు మిస్సింగ్ కేసును ఛేదించే తండ్రి ప్రయాణం ఉత్కంఠభరితం.
- పోస్ట్ మార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
ప్రతి తండ్రీ కూతురు తప్పక చూడాల్సిన భావోద్వేగ కథ ఇది! ZEE5లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తాయి. రాజీవ్ కనకాల నటన అద్భుతం!
కూతురి కోసం తండ్రి అన్వేషణ!
ఆడపిల్లల్ని భయంతో కాదు.. ధైర్యంతో పెంచాలని, ఎక్కడున్నా ధైర్యంగా నిలబడేలా పెంచాలని చాటిచెప్తూ.. ఇటీవలే ZEE5లో వెబ్ సిరీస్ విడుదలైంది. అదే ‘D/O ప్రసాదరావు కనుబడుటలేదు’. ఈ సిరీస్‌లో వచ్చే ట్విస్ట్.. అందరికీ కనువిప్పు కలిగిస్తుంది. నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితుల్నే ఇందులో కంటికి కట్టినట్లుగా చూపించాడు.. డైరెక్టర్ పోలూరు కృష్ణ. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఉదయభాను, గాయత్రి భార్గవి, జెమిని సురేశ్ కీలక పాత్రలు పోషించగా.. చైల్డ్ ఆర్టిస్ట్ వసంతిక D/O ప్రసాదరావుగా స్వాతి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది.
స్టోరీలోకి వెళ్తే.. మాదాపూర్‌లోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో యువతి మిస్సవ్వడం కలకలం రేపుతుంది. ఆ హాస్టల్లోనే ఓ అమ్మాయి మీడియా ఛానల్లో పనిచేస్తుండటంతో విషయం మీడియాకు లీకవుతుంది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ కోసం రెబెకా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. ఇంతలో ప్రసాదరావు(రాజీవ్ కనకాల) తన కూతురి ఫోన్ రాత్రి నుంచి స్విచ్ఛాఫ్ వస్తుండటంతో నెల్లూరు నుంచి కారులోనే హైదరాబాద్ లో కూతురు ఉంటే హాస్టల్‌కి చేరుకుంటాడు. అక్కడ హడావిడి చూసి కంగారుగా తన కూతురి గురించి అడగ్గా.. మిస్సైందని చెప్తారు. దాంతో అతను కుప్పకూలిపోయి.. కూతురి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు.
పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు!
స్వాతి (వసంతిక)ని పుట్టినప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ప్రసాదరావు.. జాబ్ కోసం హైదరాబాద్‌కు పంపడం ఇష్టలేదని మొండికేస్తాడు. తండ్రితో ధైర్యంగా మాట్లాడలేని స్వాతి.. తన మామయ్య, బాబాయ్‌ల సహాయంతో ఏదోలా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునేందుకు ఒప్పిస్తుంది. ఉద్యోగంలో చేరి నెలపూర్తయ్యే సరికి తొలి జీతం తండ్రిచేతిలో పెట్టి.. తాను చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పాలనుకుంటుంది. కానీ ఊహించని రీతిలో జీతం వచ్చేరోజున చాలా డల్ అయిపోతుంది. కట్ చేస్తే ఆరోజు సాయంత్రం నుంచి స్వాతి కనిపించకుండా పోతుంది. పోలీసులు కూడా కనుగొనలేని స్వాతి ఆచూకీని ప్రసాదరావు కనుక్కుంటాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. హాస్టల్ సీసీటీవీల్లో ఎక్కడా బయటికెళ్లినట్లు కనిపించని స్వాతి ఎలా చనిపోయింది? ప్రసాదరావుకు ఆమె ఉన్న చోటు ఎలా తెలిసింది? స్వాతిపై అంతటి దారుణానికి పాల్పడిందెవరు? పోస్టుమార్టం రిపోర్టు చూసిన రెబెకా ఎందుకు షాకయింది? కేసు క్లోజయ్యాక అసలు నిందితులు ఏమయ్యారు అన్నదే మిగతా సిరీస్.
జీ5లో ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్!
ఓ బాధ్యతగల తండ్రిగా ప్రసాదరావు క్యారెక్టర్లో కూడా రాజీవ్ కనకాల జీవించారు.. కూతురిగా వసంతిక కూడా స్వాతి పాత్రకు న్యాయం చేసింది. తండ్రంటే అమితమైన ప్రేమ.. కానీ ఎప్పుడూ ఫ్రెండ్లీగా మాట్లాడకపోవడంతో ఎంతో ఇబ్బంది పడింది. ఈ ఎమోషన్లను తెరపై చాలా బాగా చూపించింది. హాస్టల్ వార్డెన్‌గా భవాని క్యారెక్టర్లో గాయత్రి భార్గవి చాలా బాగా నటించింది. నిజానికి ఆమె సాఫ్ట్ క్యారెక్టర్లే ఎక్కువగా చేసింది. ఇలాంటి రోల్స్ చేయడం చాలా అరుదు. ఇక ఉదయభాను కూడా కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ఇమిడిపోతుంది. కొన్ని సీన్లలో బీజీఎం వల్లే భావోద్వేగం పండింది. శ్రీరామ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ D/O ప్రసాదరావుకు ప్లస్ అయింది. ఫ్యామిలీ, రివేంజ్ అండ్ ట్విస్టులతో దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది. సిరీస్ చివరిలో ఇచ్చిన మెసేజ్.. ప్రస్తుత సమాజంలో ప్రతీ తల్లి -తండ్రులకు చాలా అవసరం. యువత కూడా ఈ సిరీస్‌ను చూస్తే.. మనచుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటివాళ్లో, ఎవరు ఎందుకు మనతో మంచిగా మసలుకుంటున్నారో తెలుస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు కనీస వసతులతో పాటు చదువును చెప్పించడం ఎంత ముఖ్యమో.. ఏ విషయాన్నైనా ముందు పేరెంట్స్‌తో చెప్పుకునే స్వేచ్ఛనివ్వడం కూడా అంతే ముఖ్యం. చివరిగా.. D/O ప్రసాదరావు.. ప్రతీ తండ్రి, ప్రతీ కూతురు కచ్చితంగా చూడాల్సిన సిరీస్.
D/O ప్రసాదరావు కనుబడుటలేదు వెబ్ సిరీస్ ఒక సంచలనం సృష్టించింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


