
నటి శోభితా ధూళిపాళ ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ గురించి ఆసక్తికరమైన రివ్యూ ఇచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాను తప్పక చూడాలని ఆమె గట్టిగా సిఫార్సు చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై శోభిత ప్రశంసల వర్షం కురిపించగా, దాని చుట్టూ ఉన్న వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది.
Key Points
నటి శోభితా ధూళిపాళ వివాదాస్పద 'బ్యాడ్ గర్ల్' మూవీకి రివ్యూ ఇచ్చింది.
ఈ సినిమాను ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాలని శోభిత గట్టిగా సిఫార్సు చేసింది.
'బ్యాడ్ గర్ల్' ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక బ్రాహ్మణ అమ్మాయి లైంగిక కోరికలు, సాంప్రదాయవాదం చుట్టూ వివాదం నడుస్తోంది.
శోభితా ధూళిపాళ ‘బ్యాడ్ గర్ల్’ రివ్యూ
ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఓ వివాదాస్పద మూవీని అస్సలు మిస్ కాకుండా చూడాలంటూ అక్కినేని ఇంటి కోడలు, నటి శోభితా ధూళిపాళ రివ్యూ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాను కచ్చితంగా చూడాలని ఆమె చెప్పింది.
తమిళంలో విడుదలైన ‘బ్యాడ్ గర్ల్’ (Bad Girl) సినిమాపై నటి శోభిత ధూళిపాళ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ట్రైలర్ విడుదలైనప్పుడు వివాదంలో చిక్కుకున్న ఈ మూవీపై శోభిత ప్రశంసల వర్షం కురిపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘బ్యాడ్ గర్ల్’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న శోభిత
‘బ్యాడ్ గర్ల్’ సినిమా చుట్టూ వివాదం ఏంటి?
ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాలని గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ఈ సినిమా మనందరి కోసం! వర్ష భరత్ (దర్శకురాలు), అంజలి శివరామన్‌లకు (నటి) ప్రత్యేక అభినందనలు. మీరిద్దరూ అసాధారణమైనవారు. దీన్ని జియోహాట్‌స్టార్ లో చూడండి” అని శోభిత చెప్పింది. శోభిత ఇచ్చిన ఈ రివ్యూను దర్శకురాలు వర్ష, నటి అంజలి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేశారు.
‘బ్యాడ్ గర్ల్’ చుట్టూ వివాదం
“ఒక బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చూపించడం ఈ వర్గానికి ఎప్పుడూ బోల్డ్, రిఫ్రెష్ సినిమానే. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ అండ్ కో. నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. బ్రాహ్మణ తండ్రి, తల్లిని విమర్శించడం పాత ఫ్యాషన్ అయింది. కొత్తగా లేదు.. మీ సొంత కుల అమ్మాయిలతో ప్రయత్నించి ముందు మీ కుటుంబానికి చూపించండి” అని అతడు ఎక్స్ లో రాసుకొచ్చాడు.
ఓటీటీలో ‘బ్యాడ్ గర్ల్’ ఎక్కడ చూడాలి?
రమ్య అనే టీనేజ్ బ్రాహ్మణ అమ్మాయి లైంగిక కోరికలు, సంప్రదాయవాద కుటుంబం, సమాజం అంచనాలకు వ్యతిరేకంగా ఆమె చేసే ప్రయాణం ఈ వివాదానికి ప్రధాన కారణం.
‘బ్యాడ్ గర్ల్’ చిత్రం గురించి..
శోభితా ధూళిపాళ రివ్యూతో ‘బ్యాడ్ గర్ల్’ సినిమాకు మరింత గుర్తింపు వచ్చింది. ఆమె ప్రశంసలు, చిత్రంలోని వివాదాస్పద అంశాలు ప్రేక్షకుల్లో చర్చను రేకెత్తిస్తున్నాయి. జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని చూడవచ్చు.


