
📌 Key Points
- బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తింటే త్వరగా ఆకలి వేస్తుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
- దోశలో పనీర్ చేర్చడం ద్వారా ప్రోటీన్ స్థాయిని పెంచవచ్చు, ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
- పనీర్ కలిపిన దోశ తింటే 3-4 గంటల వరకు ఆకలి వేయదు, ఇది స్నాకింగ్ అలవాట్లను తగ్గిస్తుంది.
- సమతుల్య ఆహారం కోసం దోశలో ప్రోటీన్ జోడించడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తినడం మంచిది కాదని ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ అంటున్నారు. దోశ బదులు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మేలు అని ఆయన సూచిస్తున్నారు.
దోశ తినడం వల్ల కలిగే నష్టాలు
Protein dosa benefits : మీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్‌లో దోశ కూడా ఉందా? దోశ కనిపిస్తే చాలు, తినకుండా ఉండలేరా? అయితే మీరు వెంటనే ఈ అలవాటును మానుకోవాలంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్. తమన్నా భాటియా వంటి స్టార్స్‌కి ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేసిన ఈయన ఇటీవలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. “బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తినడం ఆపండి” అంటూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఆయన ఉద్దేశం దోశ ను పూర్తిగా నిషేధించడం కాదు! అది ఆకలిని నియంత్రించలేక పోవడమే అసలు సమస్య అని ఆయన విశ్లేషించారు.
సిద్ధార్థ్ వాదన ప్రకారం.. బియ్యం, మినప్పప్పుతో చేసే సాధారణ దోశ చాలా త్వరగా అరిగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ వేగంగా పడిపోతాయి
“బరువు తగ్గాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ మానేయండి. మీరు దోశ తిన్న గంటకే మీకు మళ్లీ ఆకలి వేస్తుంది. ఆ సమయంలో ఏదో ఒకటి తినాలనే కోరికలు మొదలవుతాయి. దీనివల్ల మీరు అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటారు, అది కాస్తా కొవ్వుగా మారుతుంది,” అని ఆయన వివరించారు.
దోశలోని పదార్థాలు (బియ్యం, మినప్పప్పు, సాంబార్) ఏవీ అనారోగ్యకరమైనవి కావు, కానీ అవి ఇచ్చే ‘తృప్తి’ తక్కువగా ఉండటమే ప్రధాన లోపం అని అన్నారు.
A post shared by Siddhartha Singh (@officialsiddharthasingh)
మీకు దోశ అంటే చాలా ఇష్టమైతే, దానిని వదులుకోవాల్సిన పనిలేదు. సిద్ధార్థ్ సూచించిన ఈ చిన్న ‘ ప్రోటీన్ హ్యాక్’ పాటిస్తే సరిపోతుంది:
“దోశ అసంపూర్ణమైనది. దానిని బ్యాలెన్స్ చేయాలంటే మీరు దానిలో పనీర్‌ను చేర్చాలి. పనీర్‌ను నలిపి మసాలాలా చేసి దోశ మధ్యలో పెట్టుకుని తినండి” అని ఆయన సలహా ఇచ్చారు.
ప్రోటీన్ దోశతో బరువు తగ్గడం ఎలా?
ఎక్స్‌ట్రా ప్రోటీన్: పనీర్ ద్వారా అందే ప్రోటీన్ వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
ఆకలి నియంత్రణ: ఇది తిన్న తర్వాత కనీసం 3 నుంచి 4 గంటల వరకు మళ్ళీ ఆకలి వేయదు.
స్నాకింగ్ చెక్: మధ్యలో అనవసరమైన చిరుతిళ్లు తినకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
సమస్య: తిన్న వెంటనే ఆకలి వేయడం, క్యాలరీలు పెరగడం.
పరిష్కారం: దోశలో పనీర్ వంటి హై-ప్రోటీన్ పదార్థాలను చేర్చుకోవడం.
ఫలితం: బరువు తగ్గడానికి సహకరించే సమతుల్య ఆహారం.
“కాబట్టి దోశ తినండి.. కానీ మరుసటి సారి తినేటప్పుడు ఈ ప్రోటీన్ చిట్కాను గుర్తుంచుకోండి” అని ఆయన తన అభిమానులకు సూచించారు.
ఫిట్‌నెస్ నిపుణుల సూచనలు
1. దోశ ఆరోగ్యకరమైనది కాదా?
దోశ ఆరోగ్యకరమైనదే. కానీ బరువు తగ్గాలనుకునే వారికి దానిలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేసి, ఎక్కువ తినేలా చేస్తుంది.
2. పనీర్‌కు బదులుగా వేరే పదార్థాలు వాడవచ్చా?
అవును. ప్రోటీన్ కోసం పనీర్‌కు బదులుగా కోడిగుడ్డు (ఎగ్ దోశ), సోయా కీమా లేదా మొలకెత్తిన గింజల మసాలాను కూడా వాడుకోవచ్చు.
3. కేవలం సాంబార్‌తో దోశ తింటే సరిపోదా?
సాంబార్లో పప్పు ఉన్నప్పటికీ, అది దోశతో కలిపి తీసుకున్నప్పుడు తగినంత ప్రోటీన్, ఫైబర్ అందించలేకపోవచ్చు. అందుకే అదనపు ప్రోటీన్ ఫిల్లింగ్ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
దోశను పూర్తిగా మానేయకుండా, అందులో ప్రోటీన్ కలిపి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.


