
ఇంటి అలంకరణలో భాగంగా చాలామంది డ్రీమ్ క్యాచర్స్ ఉపయోగిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని ఎక్కడ ఉంచడం శుభప్రదమో, సానుకూల శక్తిని పొందేందుకు ఏమి చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం.
Key Points
డ్రీమ్ క్యాచర్స్ వాయువ్య దిశలో ఉంచడం శుభప్రదం.
సహజ పదార్థాలతో తయారైన డ్రీమ్ క్యాచర్స్ ఉపయోగించండి.
డ్రీమ్ క్యాచర్స్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
పడకగదిలో ఉంచేటప్పుడు, తల వైపు ఉంచడం మంచిది.
వాస్తు ప్రకారం డ్రీమ్ క్యాచర్స్ స్థానం
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. వాస్తు ప్రకారం ఫాలో అయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. చాలా మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ప్రతీ ఒక్కరు కూడా ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకుంటారు. అందుకోసం వివిధ వస్తువుల్ని అలంకరణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు.
ఎక్కువ మంది ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ని కూడా పెడుతూ ఉంటారు. డ్రీమ్ క్యాచర్స్ సానుకూల శక్తిని తీసుకువస్తాయి. మంచి నిద్రని అందిస్తాయి. అమెరికన్ సంస్కృతి అయినప్పటికీ భారతదేశంలో కూడా చాలా మంది వీటిని ఇంట్లో పెడుతున్నారు. వీటి వలన అనేక మార్పులను చూడవచ్చు. డ్రీమ్ క్యాచర్స్ కి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రీమ్ క్యాచర్స్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఈ వాస్తు నియమాలని పాటించండి
సానుకూల శక్తిని ఆకర్షించే చిట్కాలు
కొన్ని నియమాలని పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండవచ్చు. డ్రీమ్ క్యాచర్స్ ని పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం వాటిని ఉంచడం చాలా ముఖ్యం. మరి ఎటువంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం వీటిని వాయువ్యం వైపు ఉంచితే మంచిది. ఇలా ఉంచినట్లయితే సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా ఇంట్లో ప్రేమానురాగాలు ఉంటాయి. పడక గది లో పెట్టాలనుకుంటే మంచానికి పైన లేదంటే నిద్రపోయేటప్పుడు తల ఏ వైపు ఉంటే ఆ వైపు పెట్టుకోవడం మంచిది. ఇలా ఉండడం వలన పడకగదిలో ప్రశాంతత ఉంటుంది.
2.ఇలాంటి వాటిని పెడితే మంచిది
డ్రీమ్ క్యాచర్స్ శుభ్రత మరియు నిర్వహణ
డ్రీమ్ క్యాచర్స్ ని పెట్టేటప్పుడు సహజమైన వాటితో తయారు చేసినవి అయ్యి ఉండేటట్టు చూసుకోండి. కాటన్, దారాలు, ముత్యాలు, సహజమైన ఈకలతో తయారు చేసిన వాటిని కూడా ఇంట్లో పెడితే మంచిది.
ఎలా అయితే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో డ్రీమ్ క్యాచర్స్ ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎండలో ఆరబెడితే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇంటిలో డ్రీమ్ క్యాచర్స్ ఉంచడం ద్వారా సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. వాస్తు నియమాలను పాటించి, పరిశుభ్రతను కాపాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


