
📌 Key Points
- దృశ్యం 3 విడుదల వాయిదా: ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
- ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన సినిమా పోస్ట్ పోన్!
- యుద్ధ పరిస్థితుల కారణంగా మేకర్స్ సంచలన నిర్ణయం!
- మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోకి ఎదురుదెబ్బ!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దృశ్యం 3 కూడా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, అభిమానులకు షాకిచ్చే వార్త ఏమిటంటే సినిమా విడుదల వాయిదా పడింది!
దృశ్యం 3 విడుదల ఎప్పుడు?
Drishyam 3: మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం సినిమా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ లో వచ్చిన రెండు భాగాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 3(Drishyam 3) కూడా వస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల కోసం మలయాళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రిలీజ్ వాయిదాకు కారణం ఏంటి?
కానీ, ఆ అభిమానులకు నిరాశ ఎదురయ్యే వార్తను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే విడుదలైన అధికారిక పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచినప్పటికీ.. ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల వల్ల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఫ్యాన్స్ ఆందోళన.. మేకర్స్ నిర్ణయం!
మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు అతిపెద్ద ఆదాయం వస్తుంది. అక్కడ నెలకొన్న అనిశ్చితి వల్ల థియేటర్ల వద్ద వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమా కావడంతో, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్టు సమాచారం. దీంతో, దృశ్యం 3 సినిమా కోసం చూస్తున్న ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
దృశ్యం 3 విడుదల వాయిదా పడటం నిజంగా బాధాకరమైన విషయమే. కానీ, మేకర్స్ సరైన సమయం చూసుకొని సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


