|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవిబాబు ‘రేజర్’ గ్లింప్స్: ఆ ముక్కలు చేసే దృశ్యాలు… చూడాలంటే ధైర్యం కావాలి!

Published: 24-12-2025, 1:32 AM
రవిబాబు 'రేజర్' గ్లింప్స్: ఆ ముక్కలు చేసే దృశ్యాలు... చూడాలంటే ధైర్యం కావాలి!
  • రవిబాబు దర్శకుడిగా కొత్త సినిమా ‘రేజర్’ ప్రకటించారు.
  • ‘రేజర్’ టైటిల్ గ్లింప్స్ లో భయానకమైన, హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి.
  • సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రవిబాబే హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఈ సినిమా సమ్మర్ 2026లో విడుదల కానుంది.

రవిబాబు దర్శకుడిగా మళ్ళీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కొత్త సినిమా ‘రేజర్’ టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. భయానకమైన దృశ్యాలతో కూడిన ఈ గ్లింప్స్, సమ్మర్ 2026లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలను పెంచింది.

రవిబాబు విభిన్న చిత్రాలు: గత విజయాన్నే పునరావృతం చేస్తారా?

Ravi Babu : కమెడియన్ గా, విలన్ గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు దర్శకుడిగా కూడా మొదట్నుంచి కొత్త కొత్త కథలతో మెప్పిస్తున్నాడు. అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్.. లాంటి డిఫరెంట్ కాన్సెప్తులతో సినిమాలు ఈసీ హిట్స్ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు. డైరెక్టర్ గా కొంత గ్యాప్ తీసుకున్న రవిబాబు ఇటీవల మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు.(Ravi Babu)

కొన్ని రోజుల క్రితమే ఏనుగుతొండం ఘటికాచలం అనే సినిమాతో ఈటీవీ విన్ ఓటీటీలో పలకరించాడు రవిబాబు. తాజాగా రవిబాబు కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాడు. రవిబాబు కొత్త సినిమా పేరు ‘రేజర్’ అని ప్రకటించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ లో మనుషులను ముక్కలు ముక్కలుగా నరికేసినట్టు చూపించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు తెలుస్తుంది.

‘రేజర్’ టైటిల్ గ్లింప్స్: భయపెట్టే దృశ్యాలు

సినిమా విడుదల & నిర్మాణ వివరాలు

ఇక ఈ రేజర్ సినిమాని సమ్మర్ 2026 లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పిన రవిబాబు సినిమా ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి. మీరు కూడా రవిబాబు కొత్త సినిమా రేజర్ టైటిల్ గ్లింప్స్ చూసేయండి..

రవిబాబు ‘రేజర్’ గ్లింప్స్ తో తన విభిన్న శైలిని చాటుకున్నారు. భయపెట్టే ఈ చిత్రం సమ్మర్ 2026లో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.