|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దృశ్యం 3: వెంకీ లేకుండానే తెలుగులో మోహన్‌లాల్ మాయ! కారణం ఇదే!

Published: 30-04-2026, 8:56 PM
దృశ్యం 3: వెంకీ లేకుండానే తెలుగులో మోహన్‌లాల్ మాయ! కారణం ఇదే!
  • దృశ్యం 3 మే 21న విడుదలవుతుంది, ఓటీటీ డీల్ వివాదాల మధ్య.
  • మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్.
  • వెంకటేష్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే రీమేక్ చేయడం లేదు.
  • టీజర్‌లో జార్జ్ కుట్టి భయపడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం 3 మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి ఒరిజినల్ వెర్షన్ తెలుగులోనూ విడుదల కావడం విశేషం. అయితే, తెలుగు రీమేక్‌లో వెంకటేష్ ఎందుకు నటించలేదనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. తాజా టీజర్ విడుదలైన నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

దృశ్యం 3: విడుదల తేదీ, ఓటీటీ చిక్కులు

Drishyam 3: మలయాళం సూపర్ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం సిరీస్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సీరీస్ మలయాళం లో వచ్చినప్పటికీ తెలుగు, కన్నడ, తమిళం, సింహళం, మాండరిన్ చైనీస్ తో పాటు హిందీ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. పైగా దృశ్యం, దృశ్యం2 సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టున్నాయి.. దీంతో దృశ్యం3 కి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అటు ఒరిజినల్ వెర్షన్ మలయాళం కోసం అభిమానులు భారీ స్థాయిలో ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.. నిజానికి ఈ సినిమా ఓటీటీ డీల్ ను నిర్మాతలు క్యాన్సిల్ చేసుకోవడంతో అమెజాన్ ఏకంగా కోర్టు ను ఆశ్రయించింది. దీంతో స్పందించిన కోర్టు మూడు వారాలపాటు స్టే విధించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ వాయిదా పడుతుందనే కామెంట్లు వ్యక్తమైనా.. మే 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి దృశ్యం 3 మలయాళ వెర్షన్ విడుదలైన తర్వాత ఈ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు పెడతారు అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉండడంతో ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. దీనికి తోడు వెంకటేష్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే దృశ్యం పార్ట్ 3 రీమేక్ చేయడం లేదు. అందుకే నేరుగా మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వెర్షన్ ను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా వెంకీ మామ ఈసారి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేష్ దూరంగా ఉండటానికి కారణం?

దృశ్యం 3 విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు జీతూ జోసెఫ్ బుధవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా .. ఈ వీడియోలో గత రెండు భాగాలకు సంబంధించిన కీలక ఘట్టాలను గుర్తు చేస్తూనే మూడవ భాగంపై అంచనాలు పెంచేశారు. గతంలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ధైర్యంగా, ప్రశాంతంగా ఎత్తుగడలు వేసిన జార్జ్ కుట్టి.. ఈసారి తీవ్రమైన భయంలో కనిపిస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.” ఇప్పుడు నాకు భయంగా ఉంది సార్ ..నన్ను ఇంకెవరో గమనిస్తున్నారని అనిపిస్తోంది” అంటూ మోహన్ లాల్ చెప్పే డైలాగ్ ఈసారి కథలో ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని సూచిస్తుంది. ఇక ఈ టీజర్ లో ఎస్తేర్ అనిల్, మీనా, అన్సిబా లతో పాటు ఆశ శరత్ వంటి పాత్రలన్నీ కనిపించి సందడి చేశాయి.

టీజర్ హైలైట్స్: జార్జ్ కుట్టి భయం

మొత్తానికి అయితే వెంకటేష్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్లే దృశ్యం 3 రీమేక్ చేయడం లేదని సమాచారం.

వెంకటేష్ లేకపోయినా, దృశ్యం 3 నేరుగా తెలుగులో విడుదల కావడం అభిమానులకు సంతోషం కలిగించే విషయమే. మోహన్‌లాల్ నటించిన ఈ ఒరిజినల్ వెర్షన్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. టీజర్ సృష్టించిన ఉత్కంఠ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.