|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్‌’

Published: 13-06-2025, 6:00 AM
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్‌’

మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన ‘డ్యూడ్’ చిత్రం ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ త్రిభాషా చిత్రం 80% షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో టీజర్ విడుదల కానుంది.

Key Points

1

తేజ్ నటించిన ‘డ్యూడ్’ చిత్రం ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

2

పునీత్ రాజ్‌కుమార్ కు అంకితం చేయబడిన ఈ చిత్రం 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.

4

రాఘవేంద్ర రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తూ, స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

‘డ్యూడ్’ చిత్రం విడుదల తేదీ

మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్‌. ఫుట్‌ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న “డ్యూడ్” చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!

హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ… “హీరోగా, డైరెక్టర్ గా ‘డ్యూడ్” చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం” అని అన్నారు!!

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!

చిత్ర కథాంశం

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష… ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు

‘డ్యూడ్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పట్ల ఉన్న అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేయబడిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.