|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dude OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

Updated: 12-11-2025, 12:09 AM
Dude OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 14 నుండి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ శుభవార్త సినీ వర్గాల్లో ఆనందం నింపుతోంది.

Key Points

1

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

2

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

4

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

డ్యూడ్: బాక్సాఫీస్ వద్ద ఘన విజయం

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు. చేసింది రెండు, మూడు సినిమాలే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల ‘డ్రాగన్’ చిత్రంతో వచ్చి ఘన విజయం సాధించిన ప్రదీప్ ‘డ్యూడ్’(Dude)తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇందులో మమిత బైజు (Mamita Baiju)హీరోయిన్‌గా నటించగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై..సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు విడుదలైన అన్ని భాషల్లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. దీపావళి బరిలో ఉన్న మాస్ జాతర, తెలుసు కదా వంటి చిత్రాలను ఓడించి హిట్‌గా నిలిచింది. ఇక లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది.

దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో.. ‘డ్యూడ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై స్పష్టతనిస్తూ.. ప్రముఖ సంస్థ అఫీషియల్ ప్రకటన చేసింది. ‘డ్యూడ్’ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 14 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. పరిష్కారం లేని సమస్యలతో.. ‘డ్యూడ్’ రాబోతున్నాడని తెలుపుతూ ప్రదీప్ రంగనాథన్ చాక్లెట్ తింటున్న పోస్టర్‌తో సినీ ప్రియులను సంతోషపెట్టారు.

ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫారమ్ వివరాలు

ప్రదీప్ రంగనాథన్ కెరీర్ హైలైట్స్

మొత్తంగా, ‘డ్యూడ్’ ఓటీటీ విడుదల వార్త అభిమానులను సంతోషపరుస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తమకు నచ్చిన భాషలో ఈ లవ్ స్టోరీని ఆస్వాదించవచ్చు. ప్రదీప్ రంగనాథన్ విజయం ఈ సినిమాతో మరింత బలపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.