|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ధురంధర్ 2’తో రాజకీయ నాయకుడి పరువు గంగలో కలిసింది! ఇంతకీ ఏం జరిగిందంటే?

Published: 21-03-2026, 9:35 AM
‘ధురంధర్ 2’తో రాజకీయ నాయకుడి పరువు గంగలో కలిసింది! ఇంతకీ ఏం జరిగిందంటే?
  • ‘ధురంధర్’ సినిమాలో జమీల్ పాత్ర తనదేనని ఒకప్పుడు గబోల్ అన్నారు.
  • ‘ధురంధర్ 2’లో ఆ పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉండటంతో గబోల్ భయపడుతున్నారు.
  • నెగటివ్ పాత్ర కారణంగా తనను ఆర్మీ అరెస్ట్ చేస్తుందని గబోల్ ఆందోళన చెందుతున్నారు.
  • ఒకప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడిన గబోల్ ఇప్పుడు ఆ పాత్ర తనది కాదంటున్నారు.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు నబీల్ గబోల్ ‘ధురంధర్ 2’ సినిమా కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. మొదటి భాగంలో తన పాత్రను పోలిన క్యారెక్టర్ ఉండటంతో క్రెడిట్ కోసం ప్రయత్నించగా, సీక్వెల్‌లో నెగటివ్ షేడ్స్ ఉండటంతో ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

గతంలో క్రెడిట్ కోసం ఆరాటం

Durandhar 2 controversy : సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. “సక్సెస్ కి వందమంది వారసులు ఉంటారు, ఫెయిల్యూర్ కి ఎవరూ ఉండరు” అని. కానీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాయకుడు నబీల్ గబోల్ విషయంలో ఇది కొంచెం రివర్స్ అయింది. నిన్నటి దాకా “ఆ వెండితెర పాత్ర నాదే” అని కాలర్ ఎగురవేసిన గబోల్ , ఇప్పుడు అదే పాత్ర తనది కాదని మొత్తుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గతంలో ‘ధురంధర్’ సినిమా పార్ట్-1 వచ్చినప్పుడు, అందులో ‘జమీల్ జమాలీ’ అనే పాత్ర విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆ పాత్ర తన జీవితం ఆధారంగానే రూపుదిద్దుకుందని నబీల్ గబోల్ అప్పట్లో తెగ మురిసిపోయారు.టీవీ ఇంటర్వ్యూల్లో “జనం నన్ను ఇప్పుడు నబీల్ అని పిలవడం మానేసి ‘జమీల్ జమాలీ’ అంటున్నారు” అని నవ్వుతూ ఇంటర్వ్యూలు ఇచ్చారు . ఇక సినిమా సక్సెస్ లో తన క్రెడిట్ కూడా ఉందని సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశారు కూడా .

అయితే, సినిమా వాళ్లు ఊరికే ఉంటారా? తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’లో జమీల్ జమాలీ పాత్ర అసలు రంగు బయటపెట్టారు. సీక్వెల్‌లో ఆ పాత్రకు ఉన్న అండర్ వరల్డ్ సంబంధాలు, డార్క్ షేడ్స్, క్రిమినల్ కనెక్షన్లు చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.ముఖ్యంగా పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళం మధ్య, ఒక సినిమా పాత్రను తనదిగా చెప్పుకోవడం ఇప్పుడు నబీల్ గబోల్ ప్రాణాల మీదకు తెచ్చింది.

‘ధురంధర్ 2’తో తలకిందులైన జీవితం

నబీల్ గబోల్ భయం వెనుక బలమైన కారణం ఉందని నెటిజన్లు అనాలసిస్ చేస్తున్నారు. ఆ పాత్రకున్న నెగటివ్ షేడ్స్ నిజంగానే తనకున్నాయని భావించి పాక్ ఆర్మీ మరియు నిఘా సంస్థలు తనను అదుపులోకి తీసుకుంటాయేమోనని ఆయన హడలిపోతున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం గట్టి విచారణ చేపడితే, తను గతంలో ఒప్పుకున్న స్టేట్‌మెంట్లే తనకు ఉరితాడుగా మారుతాయని గబోల్ వర్రీ అవుతున్నారు.

దాంతో ఇప్పుడు ఏ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లినా.. “ఆ పాత్రకు నాకు అసలు సంబంధమే లేదు.. జమీల్ జమాలీ నాది కానే కాదు” అంటూ గట్టిగా వాదిస్తున్నారట. ఒకప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడి, ఇప్పుడు అదే పాత్ర తనది కాదని మొత్తుకుంటున్న ఆయన పరిస్థితి చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

భయంతో వెనక్కి తగ్గుతున్న గబోల్

సినిమా అనేది ఫిక్షన్. కానీ రాజకీయాల్లో పబ్లిసిటీ కోసం వెండితెర పాత్రలను ఓన్ చేసుకుంటే ఇలాంటి వింతైన చిక్కులే వస్తాయని గబోల్ ని చూస్తే అర్థమవుతోంది. మరి ఈ ‘ధురంధర్’ గండం నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి!

సినిమా అనేది కల్పితం అయినప్పటికీ, రాజకీయాల్లో పబ్లిసిటీ కోసం సినిమా పాత్రలను సొంతం చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నబీల్ గబోల్ ఉదంతం ద్వారా తెలుస్తోంది. ఆయన ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.