
📌 Key Points
- పార్టీ మారే ప్రసక్తి లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
- కేసీఆర్ తనను ఇబ్బందులకు గురి చేశారని, ఫార్మ్ హౌస్ కూల్చారని ఆరోపించారు.
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీదనే నడుస్తోందని విమర్శించారు.
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. కేసీఆర్ తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ మార్పుపై ఈటల రాజేందర్ క్లారిటీ
తాను పార్టీ మారుతున్నానంటూ కొంతమంది అనవసరమైన పోస్టర్ లు వేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి 5 ఏళ్ల అవుతుందని… ఆ తర్వాత బీజేపీలో చేరానని గుర్తు చేశారు. పార్టీలు మారడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు.
“నా గురుంచి తెలంగాణ సమాజానికి తెలుసు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఈటలను పొగుట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఈటల.. కేసీఆర్ తో కలుస్తారు అని కొందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయవద్దని చెబుతున్నాను. నాడు నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారు. ఆయన చేయని పనిలేదు. కోళ్ళ ఫార్మ్ లు కూల్చారు… భూములు గుంజుకున్నారు” అని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
కేసీఆర్‌పై ఈటల రాజేందర్ విమర్శలు
“అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇతర పార్టీల నుండి వస్తారు అంటారు. నన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఆహ్వానించారు. కోరుకున్న మంత్రిపదవి ఇస్తా అన్నారు. కానీ కమిట్మెంట్ తో ఉద్యమంలో ఉన్నా. కేసీఆర్ పై పోరాటంలో భాగంగా కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే మంత్రినో లేదా డిప్యూటీ సీఎంనో అయ్యే వాడిని. నేను పదవుల కోసం పాకులాడను” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
నా పార్టీ ఏమీ ఆలొచిస్తుందో… అదే నేను కూడా ఆలోచిస్తానని ఈటీల చెప్పారు. మా నియోజకవర్గాల్లోని సమస్యలతో పాటు CSR నిధుల పై కూడా ప్రధాని కి లేఖ రాశామన్నారు. అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గెలిచారని… అబద్ధాల పునాదుల మీదనే అయన పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. మీడియాను మేనేజ్ చేస్తున్నారని… ఈ ప్రభుత్వం బుకాయిస్తు, దాబాయిస్తుందని విమర్శించారు. 6 మంది ఎంపీతో పాటు ఎమ్మెల్యేలం కలిసి కార్యక్రమాలు చేయబోతున్నామని ప్రకటించారు. GHMC పరిధిలో జరిగే ఎన్నికల్లో సర్వే లు చేస్తున్నామని… బీజేపీ సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


