
📌 Key Points
- వేగంగా తినడం వల్ల కడుపు నిండిన భావన మెదడుకు ఆలస్యంగా తెలుస్తుంది.
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వేగంగా తినడానికి కారణమవుతాయి, ఇవి బరువు పెంచుతాయి.
- వేగంగా తినడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి.
- డాక్టర్లు సూచించిన రెండు చిన్న మార్పులతో బరువు తగ్గవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
చాలామంది ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారాన్ని వేగంగా తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి గల కారణాలను, నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేగంగా తినడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
ఉదయం ఆఫీసుకి వెళ్లే తొందరలోనో, పని ఒత్తిడిలోనో లేదా బాగా ఆకలి వేసినప్పుడో.. చాలామంది భోజనాన్ని గబగబా కానిచ్చేస్తుంటారు. కొందరైతే ఆహారం చాలా రుచిగా ఉందని ప్లేట్‌ను నిమిషాల్లో ఖాళీ చేస్తారు. అయితే, ఇలా వేగంగా తినడం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతుందని మీకు తెలుసా?
చాలామంది బరువు పెరగడానికి కేవలం మనం తినే ఆహార రకం (జంక్ ఫుడ్) లేదా పరిమాణం మాత్రమే కారణమని అనుకుంటారు. కానీ, మనం ఎంత వేగంగా తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని ఫోర్టిస్ హాస్పిటల్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ హృషికేష్ సల్గాంకర్ దీని వెనుక ఉన్న సైన్స్‌ను వివరించారు.
మనం తిన్న తర్వాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు అందడానికి కొంత సమయం పడుతుంది. దీనిని ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ (Gut-brain axis) అంటారు. “మన జీర్ణవ్యవస్థకు, మెదడుకు మధ్య ఉన్న ఈ అనుసంధానం కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది. కడుపు నిండినప్పుడు విడుదలయ్యే పి.వై.వై (PYY), సి.సి.కె (CCK) వంటి హార్మోన్లు మెదడులోని హైపోథాలమస్‌కు చేరడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది” అని డాక్టర్ సల్గాంకర్ వివరించారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలా బరువు పెంచుతాయి?
అంటే, మీరు భోజనాన్ని పది నిమిషాల్లోనే ముగించేస్తే, కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు అందేలోపే మీరు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తారన్నమాట.
మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం కానీ, సౌకర్యం కోసం లేదా రుచి కోసం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై ఆధారపడతాం. ఈ ఆహార పదార్థాలు మెత్తగా ఉండి, నమలడానికి సులువుగా ఉంటాయి. ఫలితంగా మనం వాటిని అతి వేగంగా తినేస్తాం. ఇలా వేగంగా తినడం వల్ల రక్తంలో చక్కెర (Blood Sugar), ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. సహజమైన ఆహార పదార్థాలతో పోలిస్తే, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ద్వారా మూడు రెట్లు వేగంగా క్యాలరీలు మన శరీరంలోకి చేరతాయని డాక్టర్ పేర్కొన్నారు.
బరువు తగ్గడానికి డాక్టర్లు చెబుతున్న చిట్కాలు
బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఈ రెండు చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని డాక్టర్ సల్గాంకర్ సూచిస్తున్నారు.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన సమస్యలు లేదా సందేహాలు ఉంటే వెంటనే మీ డాక్టరును సంప్రదించడం ఉత్తమం.)
కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆహారాన్ని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. వైద్యుల సలహాలు పాటించి బరువును నియంత్రించుకోండి.


