|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈశా సినిమా ఫస్ట్ రివ్యూ: ఊహించని ట్విస్టులు, గుండెలు అదిరే సీన్లతో ప్రేక్షకులకు పూనకాలు!

Published: 24-12-2025, 3:02 PM
ఈశా సినిమా ఫస్ట్ రివ్యూ: ఊహించని ట్విస్టులు, గుండెలు అదిరే సీన్లతో ప్రేక్షకులకు పూనకాలు!
  • ఈశా సినిమా డిసెంబర్ 25న విడుదలవుతున్న హారర్ థ్రిల్లర్.
  • ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు.
  • ఫస్ట్ రివ్యూ ప్రకారం కథ బలంగా, బిజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని పోస్టులు వైరల్.
  • ఊహించని ట్విస్టులు, షాకింగ్ క్లైమాక్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి.

క్రిస్మస్ కానుకగా వస్తున్న ‘ఈశా’ సినిమా ఫస్ట్ రివ్యూ విడుదలైంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ నటించారు. ఈ సినిమా కథాబలం, బిజిఎం, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని మొదటి సమీక్షలు వెల్లడిస్తున్నాయి.

ఈశా: క్రిస్మస్‌కు వస్తున్న హారర్ థ్రిల్లర్ వివరాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఈషా ( eesha) కూడా ఉంది. హారర్, థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, సిరి హనుమంతు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహిస్తున్నారు.

హెచ్ వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ మూవీ వస్తోంది. హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ చాలా బలంగా ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు. బిజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుందట. అసలు ఎవరు ఊహించని ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. క్లైమాక్స్ మాత్రం షాక్ కావాల్సిందేనట. రన్ టైం ఈ సినిమాకు చాలా ప్లస్ అని చెబుతున్నారు. ఇక సీట్లో కూర్చున్న వాళ్లు కచ్చితంగా భయపడిపోతారని వివరిస్తున్నారు. మరి సినిమా జనాలను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సోషల్ మీడియాలో ‘ఈశా’ ఫస్ట్ రివ్యూ: హైలైట్స్ ఏంటి?

గుండెలు అదిరే సీన్లు.. ఆడియన్స్‌కు సర్ప్రైజ్‌లు!

ఈశా సినిమా మొదటి సమీక్ష బట్టి, థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపిక కానుంది. గుండెలు అదిరే సీన్లు, ఊహించని మలుపులతో ఈ హారర్ థ్రిల్లర్ ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.