|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్- దర్శకత్వం, సాహిత్యం అందించిన హీరో

Published: 05-10-2025, 3:48 AM
అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్- దర్శకత్వం, సాహిత్యం అందించిన హీరో

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందిన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అనిల్ ఇనుమడుగు హీరోగా నటించి, దర్శకత్వం, సాహిత్యం అందించిన ఈ పాట భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బమ్‌లో అనిల్ ఇనుమడుగు హీరో, దర్శకుడు, రచయిత.

2

మార్క్ ప్రశాంత్ సంగీతం అందించగా, దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఈ పాటను ఆలపించారు.

4

అనిల్, వేణి రావ్ కెమిస్ట్రీ, శ్రవణ్ సినిమాటోగ్రఫీకి నెటిజన్స్ నుండి ప్రశంసలు.

‘ఏమి మాయ ప్రేమలోన’ ఆల్బమ్ విశేషాలు

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందిన లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏమి మాయ ప్రేమలోన. అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్‌ గా నటించారు. అయితే, ఇటీవల విడుదలైన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బంకు మంచి ఆదరణ లభిస్తోంది.

లీడ్ రోల్స్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.

కేరళ లో బోటు నడిపే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కింది ఏమి మాయ ప్రేమలోన సాంగ్.

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న పాట

ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్‌ లో రిలీజ్ అయింది. విడుదలైన రోజు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సాంగ్. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఏమి మాయ ప్రేమాలోన పాట భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది.

ఈ పాటలో కాన్సెప్ట్‌తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పాటలోని సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉందని, విజువల్ల్ ఆహ్లాదకరంగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేరళలోని లొకేషన్స్‌ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్.

దర్శకత్వం, విజువల్స్ పై ప్రశంసలు

ఏమి మాయ ప్రేమాలోన పాటలోని ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా మలిచాడు. ఇక లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

ప్రస్తుతం ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న ఏమి మాయ ప్రేమలోన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మొత్తంగా, ‘ఏమి మాయ ప్రేమలోన’ పాట కేవలం ఒక మ్యూజిక్ ఆల్బమ్‌గా కాకుండా, అనిల్ ఇనుమడుగు ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ పాట సాధిస్తున్న విజయం తెలుగు మ్యూజిక్ ఆల్బమ్‌లకు కొత్త ఊపునిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.