
📌 Key Points
- తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్
- సినిమా సీక్వెల్ నుండి తప్పుకున్న సాయి సుశాంత్ రెడ్డి
- సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నట్లు తరుణ్ భాస్కర్ వెల్లడి
- ప్రస్తుతం తండ్రి వ్యాపార బాధ్యతల్లో సుశాంత్ బిజీగా ఉన్నారు
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అయితే, సాయి సుశాంత్ రెడ్డి ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దీనికి గల కారణాలను తరుణ్ భాస్కర్ స్వయంగా వెల్లడించారు. సుశాంత్ ప్రస్తుతం తన తండ్రి వ్యాపార బాధ్యతల్లో ఉన్నారు.
సీక్వెల్ నుండి తప్పుకున్న సుశాంత్ రెడ్డి
ENE 2: ప్రముఖ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)దర్శకత్వంలో వచ్చి కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. అప్పట్లోనే మంచి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదల చేయడమే కాకుండా ప్రస్తుతం షూటింగు కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా మొదటి భాగంలో నటించిన సెలబ్రిటీలందరూ కూడా రెండవ భాగంలో నటిస్తున్నారని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్న విషయం తెలిసిందే. అయితే సడన్గా ఈ సినిమాలో కార్తీక్ పాత్ర చేసిన సాయి సుశాంత్ రెడ్డి(Sai Sushanth Reddy) మాత్రం సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు ఇటీవల స్వయంగా ప్రకటించారు.
దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక మంచి గ్యాంగ్ ను ఈ సినిమాలో మిస్ అవుతామేమో అని చాలా ఫీలయ్యారు కూడా. ఇక ఇప్పటికే తరుణ్ భాస్కర్ ఒక ఎమోషనల్ నోట్ ద్వారా సుశాంత్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ సినిమా నుండి తప్పుకున్న సుశాంత్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయాలపై కూడా తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.
సుశాంత్ తప్పుకోవడానికి కారణం చెప్పిన తరుణ్ భాస్కర్
అసలు విషయంలోకి వెళ్తే దర్శకుడిగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న తరుణ్ భాస్కర్ హీరోగా ఈషా రెబ్బాతో కలిసి చేసిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం లో సూపర్ హిట్గా నిలిచిన జయ జయ జయ జయహే చిత్రానికి రీమేక్ ఇది. అయితే ఇప్పటికే ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసేశారు. అలాంటిది ఈ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు దీనిని పెద్దగా ఆదరించడం లేదనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ నగరానికి ఏమైంది రిపీట్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆయన పంచుకున్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..” సుశాంత్ కి ఫోన్ చేసినప్పుడు ఇందులో నటించినని అతను చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. చాలా కోపం వచ్చింది. అయితే అది అతడి వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి నేను తప్పకుండా గౌరవించాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం సుశాంత్ సినిమాలకు దూరమైనా.. తన తండ్రి వ్యాపార బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. అందుకే సినిమాలకు దూరం కావాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం సుశాంత్ ఏం చేస్తున్నారో తెలుసా?
సుశాంత్ ఈ సినిమా నుండి తప్పుకున్నప్పటికీ సినిమాలో కార్తీక్ పాత్ర మాత్రం అలాగే ఉంటుంది. ఈ పాత్ర కోసం హిట్, యానిమల్ వంటి చిత్రాలలో నటించిన శ్రీకాంత్ మాగంటిని ఎంపిక చేసుకున్నాము. మీకు.. “నటుడు మారవచ్చు కానీ కార్తీక్ క్యారెక్టర్ మాత్రం అలాగే ఉంటుంది ” ప్రస్తుతం నేను ఎడిటింగ్ రూమ్లో ఫుటేజ్ చూస్తున్నప్పుడు కూడా నాలో కార్తీక్ పాత్ర మాత్రమే కనిపించింది. అదే ఆ సినిమా మ్యాజిక్ కచ్చితంగా ప్రేక్షకులను నిరాశపరచము.. మాది గ్యారెంటీ” అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసిన సుశాంత్.. తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ కెరీయర్ ను కొనసాగిస్తున్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు.
సుశాంత్ సినిమాకు దూరంగా ఉండటానికి గల కారణాలను తరుణ్ భాస్కర్ వివరించారు. వ్యక్తిగత కారణాల వల్ల సుశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తున్నారు.


