
📌 Key Points
- గ్లీడెన్ యాప్‌లో 40 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు.
- యాప్‌లో 65% పురుషులు, 35% మహిళలు ఉన్నారు.
- మహిళల భాగస్వామ్యం గత రెండేళ్లలో 148% పెరిగింది.
- బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు.
మారుతున్న జీవనశైలికి అద్దం పడుతూ, భారతీయులు వివాహేతర డేటింగ్ యాప్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. గ్లీడెన్ యాప్‌లో 40 లక్షల మంది యూజర్లు ఉండటం దీనికి నిదర్శనం. ఈ యాప్‌లో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
గ్లీడెన్ యాప్‌లో పెరుగుతున్న భారతీయులు
మన దేశంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. కానీ, మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ వల్ల జీవిత భాగస్వామికి తెలియకుండా సీక్రెట్ డేటింగ్ కోసం వెతుకుతున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ యాప్‌లో ఏకంగా 40 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని తాజా సర్వేలో తేలింది. ‘గ్లీడెన్’ డేటింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం.. ఈ యాప్‌లో 65 శాతం పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. ఆశ్చర్యకరంగా గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరిగిందని సర్వే స్పష్టం చేసింది. రహస్యంగా డేటింగ్ చేసే వారు అత్యధికంగా బెంగళూరులో ఉన్నారని సర్వే పేర్కొంది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది ఇక్కడి నుంచే ఉన్నారు. దీని తర్వాత మన హైదరాబాద్ 17 శాతంతో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఢిల్లీ(11 శాతం), ముంబై(9 శాతం), పూణె(7 శాతం)తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ ధోరణి ప్రధాన నగరాలకే కాకుండా టైర్2 నగరాలైన లక్నో, పాట్నా, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్ లాంటి నగరాల్లోనూ వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
మహిళల భాగస్వామ్యం 148% పెరుగుదల
గడించిన రెండేళ్లలో గ్లీడెన్ యాప్‌లో మహిళల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మహిళలు తాము తీసుకునే నిర్ణయాల్లో ఎంత స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారనే దానికి ఈ వృద్ధి సూచిస్తోందని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ చెప్పారు. మహిళలు తమ ఎంపికలను ధైర్యంగా ఎంచుకుంటున్నారని సర్వే అభిప్రాయపడింది.
హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ ఎక్కువ
గ్లీడెన్ యాప్‌లో యూజర్లు గడిపే సమయాన్ని కూడా పేర్కొంది. యూజర్లు సగటున రోజుకు గంట లేదా గంటన్నర పాటు చాట్ చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో 1 నుంచి 3 గంటల మధ్య, రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు యాప్ ట్రాఫి అధికంగా నమోదవుతోంది. ఆసక్తికరంగా పురుషులు ఎక్కువగా 25-30 ఏళ్ల వయస్సున్న మహిళల కోసం, మహిళలు 30-40 ఏళ్ల మధ్య పురుషుల కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఆర్థికంగా స్థిరపడిన ప్రొఫెషనల్స్‌ను ఇష్టపడుతున్నారని సర్వే వివరించింది.
భారత్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌ల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమే. టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో ఇలాంటి ధోరణులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.


