|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Fahadh: పుష్ప విలన్ వాడే ఫోన్ ధర ఎంతో తెలుసా..10 లక్షలపైనే ఉంటుందా!

Published: 17-07-2025, 5:51 AM
Fahadh: పుష్ప విలన్ వాడే ఫోన్ ధర ఎంతో తెలుసా..10 లక్షలపైనే ఉంటుందా!

మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్, ‘పుష్ప’ సినిమాలోని అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన వాడే ఫోన్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Key Points

1

ఫహాద్ ఫాజిల్ వాడే కీప్యాడ్ ఫోన్ ధర 10 లక్షల రూపాయలకు పైనే!

2

ఈ ఫోన్ టైటానియం, ఖరీదైన లెదర్ వంటి మెటీరియల్స్ తో తయారవుతుంది.

4

ఫోన్ యొక్క ఖరీదైన తయారీ విధానం దాని ధరను పెంచుతుంది.

ఫహాద్ ఫాజిల్ యొక్క ఖరీదైన ఫోన్

స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్ ( Fahadh Faasil) గురించి తెలియని వారు ఉండరు. చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ… ఆయన సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతుంటాయి. అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సిరీస్ లో పోలీస్ పాత్రలో కనిపించి దుమ్ము లేపాడు. ఈ సినిమా మొత్తం గుండు బాస్ గెటప్ లో తెలుగు ప్రేక్షకులను అలరించాడు ఫహాద్‌ ఫాజిల్. మన ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎలాగో… మలయాళ ఇండస్ట్రీలో ఫహాద్‌ ఫాజిల్ అలాగే… పాపులర్ సాగుతున్నారు.

ఫోన్ యొక్క ప్రత్యేకతలు

ఇక ఈ మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్ ను ఫాఫా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే… బాగానే డబ్బులు సంపాదించిన ఫహాద్‌ ఫాజిల్… గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను వాడే మొబైల్ ఫోన్.. గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫహాద్‌ ఫాజిల్ వాడేటువంటి కీప్యాడ్ ఫోన్ ధర 12 వేల డాలర్లు అని సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 10 లక్షల రూపాయల పైనే అన్నమాట.

ధర ఎంత?

అయితే ఆయన వాడే కీప్యాడ్ ఫోన్ రక రకాల మెటీరియల్స్ తో తయారవుతుంది. అందుకే అంతలా కాస్ట్ ఫిక్స్ చేశారు. ఈ వెర్టు బ్రాండ్ ఫోన్లను మిషన్లతో కాకుండా చేతులతో కొత్త టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారట. అలాగే ఈ ఫోన్స్ తయారు చేసేటప్పుడు టైటానియం, ఖరీదైన లెదర్ ఇలాంటి మూలకాలు వాడుతారని తెలుస్తోంది. అందుకే కీప్యాడ్ మొబైల్ ఫోన్స్ చాలా ఖరీదైనవట.

ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు వాడే ఖరీదైన ఫోన్లు వారి జీవనశైలిని తెలియజేస్తాయి. ఈ ఫోన్ ధర, దాని తయారీ విధానం చాలా ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.