|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AA22 x A6: అల్లు అర్జున్ మూవీలో టైగర్ ష్రాఫ్ ఉన్నాడా? అసలు నిజం ఇదిగో!

Published: 09-01-2026, 8:00 AM
AA22 x A6: అల్లు అర్జున్ మూవీలో టైగర్ ష్రాఫ్ ఉన్నాడా? అసలు నిజం ఇదిగో!
  • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా AA22 x A6 గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు.
  • టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో నటిస్తున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన సినీ వర్గాలు.
  • ప్రస్తుతం స్క్రిప్ట్, వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో AA22 x A6 సినిమా టీమ్.
  • అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని, భారీ యాక్షన్ ఎమోషన్స్‌తో సినిమా ఉండనుందని సమాచారం.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న AA22 x A6 సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై సినీ వర్గాలు స్పందించాయి.

AA22 x A6 సినిమాపై వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్

Allu Arjun next movie update: సోషల్ మీడియా పుణ్యమా అని పెద్ద హీరోలకి సంబంధించిన ఏ సినిమా వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈమధ్య ఒక భారీ ప్రాజెక్ట్ గురించి కూడా పెద్ద హడావిడి జరిగింది. అదే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాను తాత్కాలికంగా AA22 x A6 అనే టైటిల్‌తో ఫ్యాన్స్ పిలుస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడు అన్న రిపోర్ట్ బయటకు వచ్చింది.

ఈ వార్త మొదటగా ఒక పెద్ద తెలుగు ఛానల్‌లో వచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతే అల్లు అర్జున్ ఫ్యాన్స్, అట్లీ ఫ్యాన్స్, టైగర్ ష్రాఫ్ అభిమానులు అందరూ ఒక్కసారిగా ఈ వార్తపై చర్చలు మొదలుపెట్టారు. ఇది పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అంటూ కామెంట్స్.. వచ్చాయి. అల్లు అర్జున్ టైగర్ ష్రాఫ్ ఒకే సినిమాలో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని ఊహించుకున్నారు. కొందరైతే కథలో కీలక పాత్రలో టైగర్ ఉంటాడని, మరికొందరు నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అని ఊహాగానాలు కూడా మొదలుపెట్టేశారు.

టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడనే వార్తల్లో నిజమెంత?

ఈ హైప్ అంత ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తను పూర్తిగా ఖండించాయి. టైగర్ ష్రాఫ్‌కు AA22 x A6 సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి అతనితో ఎప్పుడూ చర్చ కూడా జరగలేదట. ఏ దశలో కూడా అతని పేరు పరిశీలనలోకి కూడా రాలేదని స్పష్టంగా చెప్పారు. ఈ రిపోర్ట్ మొత్తం ఆధారం లేని వార్త అని తేలిపోయింది. కేవలం సోషల్ మీడియాలో క్లిక్స్, వ్యూస్ కోసం ఈ న్యూస్‌ని స్ప్రెడ్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం AA22 x A6 సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. స్క్రిప్ట్, వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారట. అట్లీ స్టైల్ మాస్ + ఎమోషన్ యాక్షన్ కలిపి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాస్టింగ్ విషయంలో ఇంకా అధికారికంగా ఎవరినీ అనౌన్స్ చేయలేదు. అందుకే రోజుకో కొత్త పేరు బయటకు వస్తోంది.

ప్రస్తుతం సినిమా పరిస్థితి ఏంటి?

టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్‌లో లేరు కానీ తన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లగ్ జా గలే అనే యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని లీక్ వీడియోలు బయటకు వచ్చాయి. అందులో టైగర్ చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్‌ని నమ్మకుండా ఉండటం మంచిది. సినిమా ప్రారంభ దశలో ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.