|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్ మంజు వారియర్ కు అభిమాని షాక్! అందరి ముందే ముద్దు.. దుమారం రేపిన ఘటన!

Published: 06-04-2026, 11:05 AM
హీరోయిన్ మంజు వారియర్ కు అభిమాని షాక్! అందరి ముందే ముద్దు.. దుమారం రేపిన ఘటన!
  • మంజు వారియర్ కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొనగా అభిమాని ముద్దు పెట్టారు.
  • సదరు మహిళా అభిమాని మంజు వారియర్ కు తాను పెద్ద అభిమానినని తెలిపింది.
  • మంజు వారియర్ మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
  • ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలు బయటకు రావాలంటే భయపడేలా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ కు కేరళలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఒక కార్యక్రమానికి హాజరైన ఆమెను ఒక మహిళా అభిమాని ముద్దు పెట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంజు వారియర్ కు చేదు అనుభవం

Manju Warrier: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బయటకు రావాలి అంటే ఎంతో భయపడుతున్నారనే చెప్పాలి. ఏదైనా కార్యక్రమం నిమిత్తం సెలబ్రిటీలు బయటకు వస్తే కనుక వారికి అభిమానుల నుంచి చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. అందరి ముందు సెలబ్రిటీలతో అభిమానులు కాస్త అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల నటి హనీ రోజ్ నడుము పై ఓ అభిమాని చెయ్యి వేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మర్చిపోకముందే మరొక నటి మంజు వారియర్(Manju Warrier) కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది.

తాజాగా మంజు వారియర్ కేరళలోని పలక్కాడ్ లో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా హీరోయిన్ అక్కడికి రావడంతో అభిమానులు కూడా ఆమెను చూడటం కోసం, తనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళ అభిమాని బలవంతంగా హీరోయిన్ కు ముద్దు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. సెక్యూరిటీ తేరుకొని సదరు మహిళ అభిమానిని పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంజు వారియర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమెకు తాను పెద్ద ఫ్యాన్, అందుకే ముద్దు పెట్టుకున్నానంటూ సదరు మహిళా అభిమాని చెప్పటం గమనార్హం.

ఇలా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా అభిమానులు బయటకు రావాలంటే కాస్త భయపడుతున్నారని అభిమానులు కూడా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు బయటకు వచ్చిన సమయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గతంలో హనీ రోజ్, నిధి అగర్వాల్ వంటి వారందరూ కూడా పబ్లిక్ ఈవెంట్ లో ఇలాంటి చేదు సంఘటనలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న వీడియో

A Woman kissed Malayalam Actress Manju Warrier in a public function #ManjuWarrier #RegalJewellery pic.twitter.com/n2QnO9Fnrj

— Varun R 🇮🇳 (@VarunNR_79) April 5, 2026

నెటిజన్ల స్పందన

మంజు వారియర్ విషయానికి వస్తే ఈమె మలయాల నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .ఈమె పులయం కాదన్ను, అసురన్, కలియాట్టమ్ అనే సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక ఈమె నటించిన కన్నెళ్లతి పొట్టుమ్ తొట్టు అనే సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.. మంజు వారియర్ కేవలం నటిగా మాత్రమే కాకుండా గొప్ప డాన్సర్, రచయిత ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఈమె మలయాళం తమిళ సినిమాలలో నటించారు కానీ ఈమె నటించిన పలు సినిమాలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో మాత్రం ఈమె నటించకపోవడం గమనార్హం.

మంజు వారియర్ కు జరిగిన ఈ సంఘటన సెలబ్రిటీల భద్రత గురించిన చర్చకు దారితీసింది. అభిమానులు హద్దులు మీరకుండా ప్రవర్తించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.