
📌 Key Points
- తండ్రి తన బిడ్డను మొదటిసారి చూసినపుడు చేతులు వణికిపోయాయి.
- వైద్యురాలు బిడ్డను ఎలా ఎత్తుకోవాలో తండ్రికి నేర్పించారు.
- ఈ వీడియోను 20 కోట్ల మందికి పైగా నెటిజన్లు చూశారు.
- తండ్రి ప్రేమను, బాధ్యతను ఈ వీడియో తెలియజేస్తుంది.
ఒక తండ్రి తన బిడ్డను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగే భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది. చెన్నైకి చెందిన డాక్టర్ సుగన్య శరవణకుమార్ షేర్ చేసిన వీడియోలో తండ్రి తన బిడ్డను చూసి వణికిపోతున్న దృశ్యం వైరల్ అయింది.
తండ్రి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో
తల్లికి జన్మనివ్వడం ఒక ఎత్తైతే, ఆ పసి ప్రాణాన్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకోవడం తండ్రికి ఓ తీపి జ్ఞాపకం లాంటిది. ఆ సమయంలో కలిగే భావోద్వేగం మాటలకు అందనిది. తాజాగా ఓ తండ్రి తన బిడ్డను తొలిసారి చూసి ఉద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరి కళ్ళను తడిచేస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సుగన్య శరవణకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఆపరేషన్ రూమ్ బయట ఆందోళనగా వేచి చూస్తున్న తండ్రికి, డాక్టర్ అప్పుడే పుట్టిన పసికందును అప్పగించారు. బిడ్డను చూడగానే ఆ తండ్రి ఆనందంతో కంగారు పడటం నెటిజన్‌లను ఆకట్టుకుంది. అయితే, ఆ చిన్నారిని ఎలా ఎత్తుకోవాలో తెలియక, ఎక్కడ నలిగిపోతుందో అన్న భయంతో ఆయన చేతులు వణకడం అందరినీ కదిలించింది. తర్వాత డాక్టర్ ధైర్యం చెప్పి, బిడ్డను ఎలా పట్టుకోవాలో నేర్పించిన తర్వాతే ఆ తండ్రి కుదుటపడ్డారు. తండ్రి ప్రేమలోని గాంభీర్యాన్ని, బాధ్యతను చాటిచెప్పే ఈ మధుర క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
‘ప్రపంచంలోనే అత్యంత బలవంతుడైనా సరే.. తన బిడ్డను మొదటిసారి ఎత్తుకునేటప్పుడు ఆ చేతులు వణకాల్సిందే!’ అంటూ డాక్టర్ సుగన్య ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు 20 కోట్ల (200 Million) పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఈ క్రమంలోనే నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘తండ్రి ప్రేమలోని స్వచ్ఛతకు ఇది నిదర్శనం’ అని ఒకరు, ‘ఒక తండ్రికి తన బిడ్డ కంటే విలువైన నిధి ప్రపంచంలో మరొకటి ఉండదు’ అని మరొకరు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ‘నాకు ఫస్ట్ పుట్టిన బేబీని ఎత్తుకున్నప్పుడు ఇలానే ఉద్వేగానికి లోనయ్యాను.. అని చాలా మంది నెటిజన్‌లు కామెంట్ల రూపంలో తెలియజేశారు.
వైద్యురాలు నేర్పిన బిడ్డను ఎత్తుకునే విధానం
నెటిజన్ల స్పందనలు, కామెంట్లు
ఈ వీడియో తండ్రి ప్రేమను, బాధ్యతను గుర్తు చేస్తుంది. బిడ్డను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం అని నిరూపిస్తుంది. ఇది నిజంగా అపురూపమైన దృశ్యం.


