
📌 Key Points
- ‘రింగూ రింగూలా’ జానపదం 87 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో సంచలనం.
- 240K లైక్స్ తో యూత్ లో మాస్ స్టెప్పులు వేయిస్తున్న సూపర్ హిట్.
- రాము రాథోడ్ కెరీర్‌లో ‘రాను బొంబైకీ రాను’ తర్వాత మరో భారీ హిట్.
- రీల్స్, సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది.
ప్రస్తుతం జానపద పాటల హవా నడుస్తోంది. యూట్యూబ్‌లో 87 మిలియన్ల వ్యూస్‌తో ఓ మాస్ జానపదం సంచలనం సృష్టిస్తోంది. యూత్‌ను ఉర్రూతలూగిస్తూ, రికార్డుల మోత మోగిస్తున్న ఈ పాట పూర్తి వివరాలు తెలుసుకుందాం!
87M వ్యూస్ తో యూట్యూబ్‌లో సునామీ!
Folk Song : ప్రస్తుతం జానపద పాటల హవా నడుస్తోంది. బతుకమ్మ పాటల నుండి ప్రేయసీప్రియుల డ్యూయెట్స్ వరకు అనేక తెలంగాణ జానపదాలు యూట్యూబ్ లో మారుమోగుతున్నాయి. సినిమా పాటలను తలదన్నే లిరిక్స్, మ్యూజిక్ తో ఈ పల్లెపాటలు అదరగొడుతున్నాయి. ‘రాను బొంబైకీ రాను’, ‘ఓ పిలగ యెంకటేశు’ వంటి హిట్ ఫోక్స్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించడమే కాదు రీల్స్ రూపంలో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒకప్పుడే జానపదాలు అంటే పల్లెపాటలే… కానీ ఇప్పుడు పట్టణాలకు చేరువై పబ్బుల్లో కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ను ప్రజలు ఎంతలా అభిమానిస్తున్నారో చెప్పడానికి యువ సింగర్ కమ్ డ్యాన్సర్ రాము రాథోడ్ జీవితమే నిదర్శనం. సాధారణ ట్రైబల్ కుటంబానికి చెందిన ఇతడిని ఏకంగా బిగ్ బాస్ కు తీసుకెళ్లాయి ఫోక్ సాంగ్స్. అయితే రాము రాథోడ్ అనగా ‘రాను బొంబైకి రాను’ సాంగ్ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ ఇంకొన్ని హిట్ సాంగ్స్ కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. అందులో ఒకటే ఈ ‘రింగూ రింగూలా జుట్టూదానా”. ఈ జానపదం కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది… అభిమానులకు దగ్గరయ్యింది.
రింగూ రింగూలా జుట్టూదానా…
రింగూ రింగూలా జుట్టూదానా…
నతో వస్తావా.. నతో వస్తావా… నతో వస్తావా నల్లగువాడవకు..
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..
నితో వస్తాలే.. నితో వస్తాలే
నితో వస్తాలే నల్లగువాడవకు…
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు..
నితో వస్తాలే నల్లగువాడవకు..
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నువు పాల కంకివే నా పూల ఎంకివే..
నువు చాలా పెంకివే రా.. రా.. రా
నతో వత్తావా.. నతో వత్తావా
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు…
నతో వస్తావా నల్లగువాడవకు..
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు..
నున్నానున్నానీ నడుముదాన..
అరే సన్నాసన్నానీ నవ్వులదాన..
నున్నానున్నానీ నడుముదాన…
రాము రాథోడ్ ఖాతాలో మరో రికార్డు!
నతో వత్తావా.. నతో వత్తావా
నతో వస్తావా మేడారం జాతరకు..
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు..
నతో వస్తావా మేడారం జాతరకు..
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు..
నితో వస్తాలే.. నితో వస్తాలే
నితో వస్తాలే మేడారం జాతరకు…
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు…
నితో వస్తాలే మేడారం జాతరకు..
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు..
నా సిన్నీ యేలుబట్టీ రా.. రా.. రా
నతో వత్తావా.. నతో వత్తావా
అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు
అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు
తెల్లా తెల్లనీ బుగ్గలదాన..
తెల్లా తెల్లనీ బుగ్గలదాన..
నతో వత్తావా పిల్ల వత్తావా
నాతో వస్తావా ఏడేడు బావులకు
అరే నేనసలే చెప్పను నీ బావలకు
నతో వస్తావా ఏడేడు బావులకు
పిల్ల నేనసలే చెప్పను నీ బావలకు…
యువతను ఉర్రూతలూగిస్తున్న ‘రింగూ రింగూలా’!
అహా.. ఏడేడు బావులకెందుకంటా..
నాకున్నా బావవి నువ్వేనంటా..
నాకున్నా బావవి నువ్వేనంటా..
నితో వస్తాలే.. అరె నీతో వస్తాలే.. పద పద
నితో వస్తాలే నీ ఇంటి కోడలిగా
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా
నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా..
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా
సిగ్గులు తెగొట్టుకొని రా.. రా.. రా
నెనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా
నితో ఉంటాలే నీ ముద్దుల పెనివిటిగా…
నెనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా..
నితో ఉంటాలే నీ ముద్దుల పెనిమిటీగా..
ఈ రింగూ రింగూలా జుట్టూదాన సాంగ్ పల్లెటూరి ప్రేయసీ ప్రియుల సరసాల గురించి సాగుతుంది. అమ్మాయి అందాన్ని పొగుడుతూ ”నాతో వస్తావా” అని ప్రియుడు అడుగుతుంటే… అతడికి అంతే గడుసుగా ”నీతో వస్తాలే ఏడవకు” అంటుంది ప్రియురాలు. ఇలా మేడారం జాతరకు, ఏడేడు బావులకు వస్తావా అని ప్రియుడు… వస్తాలే ఏడవకు అని ప్రియురాలు చెబుతుంటుంది. చివరకు నేను నీ ఇంటి కోడలిగా వస్తానని అమ్మాయి… నేను ఇంటి అల్లుడిగా వస్తానని అబ్బాయి చెబుతాడు. ఇలా ఆధ్యంతం ఆకట్టుకునేలా ఈ పాట సాగుతుంది.
అద్భుతమైన లిరిక్స్, ఆకట్టుకునే మ్యూజిక్ తో పాటు ”రాను బొంబైకి రాను” ఫేమ్ రాము రాథోడ్, లిఖిత జోడి అదిరిపోయే స్టెప్పులకు ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే… అందుకే ఈ సాంగ్ విడుదలైన ఏడాదిలోనే యూట్యూబ్ లో ఏకంగా 87 మిలియన్స్ అంటే 87294269 వ్యూస్ తో దూసుకుపోయింది. అంతేకాదు 240k అంటే 2,40,000 పైగా లైక్స్ సాధించింది. విజిల్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటు 2025 జూన్ 12న విడుదలయ్యింది.
లిరిక్స్ : సురేష్ గంగుల, దేవ్ పవర్
సింగర్స్ : రాము రాథోడ్, ప్రభ
కొరియోగ్రఫి : శేఖర్ వైరస్
డ్యాన్స్ : రాము రాథోడ్, లిఖిత
ప్రొడ్యూసర్ : సిఎంకే ప్రొడక్షన్
పబ్లిషర్ : రాజశేఖర్ ఆర్ఎం
‘రింగూ రింగూలా’ జానపదం సాధిస్తున్న రికార్డులు నిజంగా అద్భుతం. యూత్‌లో దీని క్రేజ్ మామూలుగా లేదు. రాము రాథోడ్ కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్. ఇలాంటి మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం వేచి చూడండి!


