|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Friday Ott Releases: ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 15 సినిమాలు!

Updated: 30-11-2025, 7:23 PM
Friday Ott Releases: ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 15 సినిమాలు!

ఈ వీకెండ్ సినీ ప్రియులకు ఓటీటీల్లో పండగే. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 15 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ చిత్రాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, ప్రముఖ సిరీస్‌లు కూడా అలరించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద తెలుగు సినిమాలు విడుదల కావడం లేదు.

2

ఓటీటీల్లో 'ది బెంగాలీ ఫైల్స్', విక్రమ్ తనయుడి 'బైసన్', 'ఫ్యామిలీ మ్యాన్ 3' వంటివి సందడి చేయనున్నాయి.

4

డబ్బింగ్ చిత్రాలు, వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఒక్క రోజే 15 విడుదలలు ఉన్నాయి.

ఈ వారం థియేటర్, ఓటీటీ విడుదలలు

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు  సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ ’12ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..

బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – నవంబరు 21

ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 21

హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) – నవంబరు 21

డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) – నవంబరు 21

ఓటీటీలో కొత్త చిత్రాలు, సిరీస్‌లు

వన్ షాట్ విత్ ఈడ్‌ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21

ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 21

జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) – నవంబరు 21

ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21

ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21

అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 23

స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు

ఉసిరు (కన్నడ సినిమా) – నవంబరు 21

కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21

డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21

ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) – నవంబరు 21

షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21

టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21

మొత్తంగా, ఈ శుక్రవారం ఓటీటీ వీక్షకులకు వినోదం పంచేందుకు పలు భాషల చిత్రాలు, ఆసక్తికరమైన సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మీ వీకెండ్ ప్లాన్‌లలో ఈ కొత్త విడుదలలను చేర్చుకుని ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.