|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mother’s Day Special: మదర్స్ డే స్పెషల్.. ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాట

Published: 11-05-2025, 6:21 PM
Mother's Day Special: మదర్స్ డే స్పెషల్.. ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాట

శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘ఫ్రై డే’ సినిమా నుంచి మదర్స్ డే స్పెషల్ గా ‘అమ్మ’ పాటను విడుదల చేశారు. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఈ పాటను విడుదల చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు.

Key Points

ఫ్రై డే సినిమా విశేషాలు

శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్రై డే’ (Fry Day). డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బాబు ధూళిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు.. మూవీపై అంచనాల్ని పెంచేసాయి. ఇందులో భాగంగానే తాజాగా మదర్స్ డే స్పెషల్‌గా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అమ్మ పాట విడుదల

మంత్రి అభినందనలు

ఫ్రై డే చిత్రయూనిట్ కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. అమ్మ ప్రేమను చాటుకుంటూ వచ్చిన ఈ పాట సినిమా విజయానికి దోహదపడుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.