|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గాయపడ్డ సింహం విధ్వంసం! ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం.. బాక్సాఫీస్ బద్దలే!

Published: 01-05-2026, 11:18 AM
గాయపడ్డ సింహం విధ్వంసం! ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం.. బాక్సాఫీస్ బద్దలే!
  • తరుణ్ భాస్కర్ ట్రంప్‌పై పగతో కూడిన కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
  • శ్రీవిష్ణు గెస్ట్ రోల్ సెకండ్ హీరోగా మారి, సినిమాకు హైప్ తీసుకువచ్చింది.
  • ఫరియా అబ్దుల్లా గ్లామర్, హాస్యం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
  • ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లతో దూసుకుపోతోంది.

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన “గాయపడ్డ సింహం” సినిమా థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది! తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం ట్రంప్‌పై ప్రతీకారం అనే వినూత్న కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

తరుణ్ భాస్కర్ – ట్రంప్ పగ: అసలు కథేంటి?

కథలో ఐజి విజయ్ కాంత్ (శుభలేఖ సుధాకర్) పోలీస్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ (హర్షవర్ధన్) కలిసి బ్రూటల్ ధర్మ (జెడి చక్రవర్తి)కు చెందిన సత్య లాజిస్టిక్స్ అనే అక్రమ సంస్థను మూసివేస్తారు. అదే సమయంలో విజయ్ కాంత్ తన కూతురు షాలిని (ఫరియా అబ్దుల్లా)కి ధరహస్ (తరుణ్ భాస్కర్)తో పెళ్లి నిశ్చయిస్తాడు.పెళ్లి ఏర్పాట్ల సమయంలో సత్య లాజిస్టిక్స్ నుండి ఒక పార్సిల్ రావడం కథ కీలక మలుపు తిరుగుతుంది.

ఈ సందర్భంలో షాలిని, తన తండ్రి , ధరహస్ మధ్య ముందే పరిచయం ఉందని గుర్తించి అసలు విషయం ఏమిటని అడుగుతుంది. దీంతో ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమవుతుంది. ధరహస్ తన ప్రేమించిన అమ్మాయిని (మానస చౌదరి) పెళ్లి చేసుకోవాలంటే అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అమెరికాకు వెళ్లగానే కొన్ని నియమాల కారణంగా తిరిగి పంపించబడతాడు.

ఈ ఘటనకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నియమాలేనని భావించిన ధరహస్, తన ప్రేమించిన అమ్మాయితో పాటు ఉద్యోగం కోల్పోయిన బాధతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. దీనికోసం తన స్నేహితుడి సహాయంతో చేతబడి చేసే భైరవ్ దాస్ (శ్రీవిష్ణు)ను సంప్రదిస్తాడు. ఈ కథలో బ్రూటల్ ధర్మ పాత్ర ఎలా ప్రవేశించింది, ధరహస్ జీవితం ఎలా మారింది, అసలు సత్య లాజిస్టిక్స్ పార్సిల్‌లో ఏముంది వంటి అంశాలు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి.

శ్రీవిష్ణు ఎంట్రీ: మెయిన్ స్టోరీని డామినేట్ చేశాడా?

సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీవిష్ణు పాత్ర గెస్ట్ రోల్‌గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.

అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి.

తరుణ్ భాస్కర్ తన పాత్రలో అద్భుతమైప నటన కనబరిచాడు. శ్రీవిష్ణు మాత్రం తన ప్రత్యేక స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తమ పాత్రల్లో చక్కగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ కూడా ఫ్రెండ్ పాత్రలో హాస్యం పండించాడు. హర్షవర్ధన్, శుభలేక సుధాకర్ పోలీస్ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. జెడి చక్రవర్తి పాత్రకు సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిదిమేరబాగా నటించాచరు.

కామెడీ, యాక్షన్ కలగలిపిన “గాయపడ్డ సింహం”!

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు అనుగుణంగా ఉంది. పాటలు స్పెషల్ గా ఏమీ లేవు.. సాధారణంగా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉంటే మరింత కట్టుదిట్టంగా ఉండేది. దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ కొత్త కథను ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మరీ ముఖ్యంగా సూర్య ప్రకాష్ జ్యోసుల కథ, మాటలు సినిమాకు బాగా ప్లాస్ అయ్యాయి. మంచి మెసేజ్ తో పాటు కామెడీ, ఎమోషన్స్, ట్విస్టులు కలగలిపిన కంటెంట్ ను, సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యే విధంగా అందించారు సూర్య ప్రకాష్ జ్యోసుల. ఫైనల్ గా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

“గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.

“గాయపడ్డ సింహం” సినిమాతో తరుణ్ భాస్కర్ సత్తా చాటారు. ట్రంప్‌పై ప్రతీకారం, శ్రీవిష్ణు పవర్ ప్యాక్డ్ రోల్, ఫరియా గ్లామర్ హైలైట్. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్‌డేట్స్‌ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.