|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025: సినీ పరిశ్రమకు పండుగ.. 17 విభాగాల్లో పురస్కారాల వేడుక!

Published: 20-01-2026, 3:16 AM
గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025: సినీ పరిశ్రమకు పండుగ.. 17 విభాగాల్లో పురస్కారాల వేడుక!
  • 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డులకు చిత్ర పరిశ్రమ నుంచి దరఖాస్తులు ఆహ్వానం.
  • జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు విడుదలైన చిత్రాలు మాత్రమే అర్హులు.
  • మొత్తం 17 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు.
  • ఉత్తమ సందేశాత్మక సినిమాకు డాక్టర్ సి.నారాయణరెడ్డి అవార్డు కూడా ఇవ్వనున్నారు.

గతంలో నంది అవార్డులుగా పిలిచే అవార్డులను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులుగా మార్చిన విషయం తెలిసిందే. 2025 సంవత్సరానికి గాను గద్దర్ ఫిలిం అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గద్దర్ అవార్డుల ప్రకటన

Gaddar film Awards 2025: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో పురస్కారాలను ప్రకటిస్తూ కళాకారులను గౌరవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్పట్లో నంది అవార్డులను ప్రకటిస్తూ కళాకారులను ప్రశంసిస్తూ ఈ నంది అవార్డులను అందజేసే వారు కానీ గత కొంతకాలంగా ఈ అవార్డుల విషయంలో ప్రభుత్వాలు మౌనం వహిస్తూ వచ్చాయి. ఇక గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులు(Gaddar Awards)గా మారుస్తూ వివిధ కేటగిరీలలో భాగంగా గద్దర్ అవార్డులను ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇకపోతే ఈ ఏడాది కూడా గద్దర్ అవార్డులను ప్రధానం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. 2025 సంవత్సరానికి గద్దర్ అవార్డులకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2025 సంవత్సరానికి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా 2025 జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్మించిన సినిమాలకు మాత్రమే ఈ అవార్డులను ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు.

17 విభాగాల్లో అవార్డుల ప్రదానం

ఇక ఈ ఏడాది గద్దర్ అవార్డులలో భాగంగా ఏకంగా 17 విభాగాల నుంచి గద్దర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక వ్యక్తిగత విభాగాలలో కూడా గద్దర్ అవార్డులను ప్రకటించబోతున్నట్ట ఈ జీవో ద్వారా తెలియచేశారు. ఇక ఈ అవార్డులకు రేపు అనగా జనవరి 21 తేదీ నుంచి ఈ నెల 31 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించబోతున్నట్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జీవో విడుదల చేసింది. ఇలా మరోసారి గద్దర్ అవార్డులు రాబోతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈసారి గద్దర్ అవార్డులలో మరికొన్ని కొత్త అవార్డులను కూడా ప్రకటించబోతున్నారు. ఉత్తమ సందేశాత్మక సినిమా, డాక్టర్ సి.నారాయణరెడ్డి అవార్డును కూడా అందించబోతున్నట్టు ఈ సందర్భంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలియజేసింది.

ఇక ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే తమ సినిమాలు 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు నిర్మించిన సినిమాలు అయ్యుండాలి. మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఏ ఏ సినిమాలకు గద్దర్ అవార్డులు రాబోతున్నాయో వేచి చూడాలి.. ఇలా గద్దర్ అవార్డు వేడుకలను గత ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అంతకుమించి ఉండేలా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

దరఖాస్తుకు అర్హతలు, గడువు

గద్దర్ అవార్డుల రాకతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. ఈసారి ఏ చిత్రాలు పురస్కారాలు గెలుచుకుంటాయో వేచి చూడాలి. కొత్త అవార్డులను కూడా ప్రకటించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.