
బిగ్ బాస్ షో ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ, తాజాగా తన కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నట్లు శుభవార్తను అందించాడు. తన వదిన గర్భవతి అని, ఆమెకు సీమంతం చేసిన విషయాన్ని తెలియజేశాడు.
Key Points
గౌతమ్ కృష్ణ వదిన గర్భవతి అని శుభవార్త
సీమంతోత్సవం జరుపుకున్న గౌతమ్ కుటుంబం
‘సోలో బాయ్’ సినిమా తరువాత ఈ శుభవార్త
గౌతమ్ కృష్ణ కుటుంబంలో శుభవార్త
బిగ్‌బాస్ రియాలిటీ షోతో చాలామంది నటీనటులు బాగానే పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో గౌతమ్ కృష్ణ ఒకడు. తెలంగాణకు చెందిన ఇతడు స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు కూడా చేశారు. కాకపోతే పెద్దగా పేరు రాలేదు. అలా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు.
వదిన గర్భవతి, సీమంతోత్సవం
బిగ్‌బాస్ 7వ సీజన్‌లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయాడు. కానీ మరోసారి అవకాశం రావడంతో గతేడాది జరిగిన 8వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. రీసెంట్‌గానే ‘సోలో బాయ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిన్న సినిమా కావడంతో థియేటర్లలో పెద్దగా చూడలేదు. ప్రస్తుతం ఓటీటీలో ఉంది.
బిగ్ బాస్ నుండి సోలో బాయ్ వరకు
అసలు విషయానికొస్తే గౌతమ్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పాడు. తన కుటుంబంలోకి కొత్త మెంబర్ రాబోతున్నారని ఫొటో పోస్ట్ చేశాడు. తన వదిన ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెబుతూ, ఆమెకు సీమంతం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. మరి అన్నయ్య-వదిన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి గౌతమ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.
గౌతమ్ కృష్ణ వదిన గర్భవతి కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది. ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో గౌతమ్ కృష్ణ మరింత సినిమాల్లో కనిపిస్తారని ఆశిద్దాం.


