
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ నటి జెనీలియా అతిథిగా పాల్గొని సందడి చేసింది.
Key Points
జెనీలియా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో అతిథిగా పాల్గొంది.
కంటెస్టెంట్ల పాటలతో జెనీలియా అలసింది.
ప్రోమో మరియు ఎపిసోడ్ త్వరలోనే ఆహా ఓటీటీలో విడుదల కానున్నాయి.
తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
జెనీలియా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో
Genelia : తెలుగు ఓటీటీ ఆహా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆహా సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ చేస్తుంది. ఇప్పటికే మూడు సీజన్లు అవ్వగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.(Genelia)
ఇక ఆహా షోలలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారని తెలిసిందే. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి మన ఫేవరేట్ జెనీలియా వచ్చి సందడి చేసింది. ఎపిసోడ్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ పాటలతో జెనీలియాకు మెప్పించారు. త్వరలోనే జెనీలియా వచ్చిన ప్రోమో, ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు. ప్రతి శుక్ర, శని వారాలు కొత్త ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కంటెస్టెంట్ల ప్రదర్శనలు
Also See : Lokah Chapter 1 Chandra : మలయాళం హిట్ సినిమా.. తెలుగులో సక్సెస్ మీట్.. ఫొటోలు..
ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్ర తో పాటు సమీరా భరద్వాజ్ హోస్ట్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు.
త్వరలో విడుదలయ్యే ప్రోమో
జెనీలియా యొక్క అతిథి ప్రదర్శనతో తెలుగు ఇండియన్ ఐడల్ షో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ ఎపిసోడ్‌ను ఆహా ఓటీటీలో తప్పక చూడండి.


