
📌 Key Points
- ఆది సాయికుమార్ కెరీర్‌కు ఊపునిచ్చిన ‘శంబాల’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్!
- డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన ‘శంబాల’ చిత్రం.
- జనవరి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘శంబాల’ మూవీ.
- గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి జనవరి 21 నుంచే ‘శంబాల’ వీక్షించే అవకాశం!
ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో దుమ్మురేపిన ‘శంబాల’ మూవీ
హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్(Aadi Saikumar) కెరీర్‌కు ‘శంబాల’ (Shambhala)కొత్త ఊపునిచ్చింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహిధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్(Archana Iyer), రవివర్మ, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు. సినిమా టీజర్, ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడంతో ‘శంబాల’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం!
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ, ఎమోషనల్ సీన్స్, ఆది సాయికుమార్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఘన విజయం సాధించిన ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకోగా.. జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వీక్షకులు జనవరి 21 నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉందని ఆహా వెల్లడించింది. దీంతో థియేటర్ మిస్ అయినవారు, మరోసారి చూడాలనుకునే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు ముందుగానే అవకాశం!
A post shared by ahavideoin (@ahavideoin)
శంబాల చిత్రం ఓటీటీలోకి వస్తుండటంతో సినిమా చూడాలనుకునే అభిమానుల్లో ఆనందం వెల్లువెలుస్తుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


