|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘాటి సెన్సార్ రివ్యూ.. అనుష్క లేడీ పుష్పరాజ్.. బ్లాక్ బస్టర్ తో స్వీటి కమ్ బ్యాక్

Published: 30-08-2025, 8:14 AM
ఘాటి సెన్సార్ రివ్యూ.. అనుష్క లేడీ పుష్పరాజ్.. బ్లాక్ బస్టర్ తో స్వీటి కమ్ బ్యాక్

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన ఘాటి సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ లభించింది. సినిమాలో అనుష్క యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ అని సమాచారం.

Key Points

1

అనుష్క శెట్టి యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్.

2

రెండున్నర గంటల షార్ట్ అండ్ స్వీట్‌ రన్ టైం.

4

విక్రమ్ ప్రభు తెలుగు సినిమాల్లో అరంగేట్రం.

ఘాటి సినిమా సెన్సార్ అప్డేట్

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ `ఘాటి`. క్రిష్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో విక్రమ్‌ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుందని టీజర్‌, ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అనుష్క పాత్ర కూడా చాలా పవర్‌ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ లో అనుష్క యాక్షన్‌ సీన్లు మతిపోయేలా ఉన్నాయి.  స్వీటిలోని మరో కోణం చూడబోతున్నామని అర్థమయ్యింది.

సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న `ఘాటి` సినిమా సెన్సార్‌ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివిపై కూడా క్లారిటీ వచ్చేసింది. 2 గంటల 37 నిమిషాల రన్‌ టైంతో థియేటర్లోకి రాబోతోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్టుగా తెలిసింది. అదే సమయంలో సినిమా నిడివి కూడా డీసెంట్‌గా ఉంది. ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు మూడు గంటల వరకు ఉంటున్నాయి. ఈ క్రమంలో `ఘాటి` మూవీ రెండున్నర గంటలకే పరిమితం చేయడం విశేషం. ఇది ఆడియెన్స్ కి కాస్త రిలీఫ్‌నిచ్చే అంశమని చెప్పొచ్చు. షార్ట్ అండ్‌ స్వీట్‌గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

అనుష్క శెట్టి పాత్ర ప్రత్యేకత

ఇక సెన్సార్‌ టాక్‌ ప్రకారం సినిమాలో యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు బాగున్నాయని టీమ్ ని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం. అనుష్క చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. ఫస్ట్ హాఫ్‌ చాలా ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో సాగిందని, రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే యాక్షన్ ఫైట్, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుందట. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందట. ముఖ్యంగా అనుష్క పోషించిన శీలావతి పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉందట. ఆమె నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఆమె పాత్ర ఓ రకంగా లేడీ పుష్పరాజ్‌ని తలపిస్తుందని టీమ్‌ చెబుతోంది.

ఈ మధ్య యాక్షన్ సినిమాలు అంటే ఎక్కువగా CGI, స్టూడియో ట్రిక్స్, బాడీ డబుల్స్ గుర్తొస్తాయి. కానీ ఘాటీలో అనుష్కనే స్వయంగా స్టంట్స్ చేసినట్టుగా సమాచారం. ఆమె చేసిన రా అండ్ రియలిస్టిక్‌ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. ఈ సినిమాతో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు తెలుగులో అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనే తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. అనుష్కతో కలిసి ఆయన చేసిన యాక్షన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట. అలాగే అనుష్క, విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుగా సమాచారం.

సినిమా రన్ టైం మరియు హైలైట్స్

ఈ సినిమాలో 8 ఫైట్స్ ఉన్నాయని, అవి చూసి సెన్సార్ సభ్యులు సర్ప్రైజ్ అయ్యారట. స్వీటి మాత్రం సినిమాలో నట విశ్వరూపం చూపించినట్టుగా తెలిసింది. ఫైట్ మాస్టర్ రామ్ కృష్ణన్ యాక్షన్ సన్నివేశాలు, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా, చింతకింది శ్రీనివాసరావు డైలాగ్స్, సాగర్ నాగవెల్లి సంగీతం, ఒడిశాలోని సహజసిద్ద లొకేషన్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయని తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా విజువల్స్ చూసి దర్శకధీరుడు రాజమౌళి ఆశ్చర్యపోయారట. అంతేకాదు.. మహేష్ బాబు సినిమా కోసం ఇదే లొకేషన్స్‌ని పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఘాటి సినిమా సెన్సార్ టాక్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అనుష్క యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.