
సోషల్ మీడియాలో ఇటీవల గిరిజ ఓక్ అనే నటి అనూహ్యంగా వైరల్ అవుతున్నారు. కేవలం ఒక ఇంటర్వ్యూతో, స్కై బ్లూ శారీలో ఆమె అందం, సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘తారే జమీన్ పర్’ వంటి చిత్రాల్లో నటించిన ఈ మరాఠీ నటి నేపథ్యం, కెరీర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
నటి గిరిజ ఓక్ మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందినవారు.
ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు.
'తారే జమీన్ పర్', 'జవాన్' వంటి విజయవంతమైన సినిమాలలోనూ నటించారు.
స్కై బ్లూ రంగు శారీలో ఆమె అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
గిరిజ ఓక్ ఎవరు? ఆమె నేపథ్యం
Girija Oak : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ చెప్పలేరు. ఒక చిన్న వీడియోతో, ఒక చిన్న డైలాగ్ తో, డ్యాన్స్ తో, అంతెందుకు ప్రియా వారియర్ లాగా ఒక నవ్వుతో కూడా వైరల్ అయిపోతారు. తాజాగా గత రెండు రోజులుగా గిరిజ ఓక్ అనే నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందంగా కనిపిస్తూ సింపుల్ గా చీరలో ఉన్న ఫోటోతో గిరిజ ఓక్ వైరల్ గా మారింది.(Girija Oak)
మరాఠీ, హిందీ పరిశ్రమకు చెందిన ఈ నటి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందంగా కనపడటంతో పాటు నటుడు గుల్షన్ దేవయ్య గురించి పొగుడుతూ మాట్లాడటం, మరికొన్ని విషయాలు సరదాగా మాట్లాడటంతో వైరల్ గా మారింది.
వైరల్ అయిన ఇంటర్వ్యూ, సోషల్ మీడియా ట్రెండ్
ఇంతకీ ఈ గిరిజ ఓక్ ఎవరంటే.. మహారాష్ట్ర నాగ్ పూర్ కి చెందిన అమ్మాయి. డిగ్రీ చదివిన తర్వాత నాటకాల్లోకి వెళ్ళింది. థియేటర్ ఆర్ట్స్ చేస్తూనే పలు యాడ్స్ లో నటించింది. అనంతరం మరాఠీ, హిందీ సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తారే జమీన్ పర్, జవాన్, షోర్ ఇన్ ది సిటీ.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించింది. కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై.. లాంటి హిట్ సిరీస్ లలో కూడా నటించింది. త్వరలో థెరఫీ షెరఫీ అనే సిరీస్ తో రానుంది. ఆల్మోస్ట్ 2007 నుంచి ఇండస్ట్రీలో ఉండి అనేక సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక ఇంటర్వ్యూలో స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ కలర్ సారీలో అందంగా కనపడి, సరదాగా మాట్లాడటంతో వైరల్ గా మారింది.
స్కై బ్లూ కలర్ శారీలో ఉన్న ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దేశమంతా ఇప్పుడు ఆమె ట్రెండ్ అవుతుంది. దీంతో ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఈ ట్రెండింగ్ తో గిరిజ ఓక్ కి ఇప్పటికైనా మరింత ఫేమ్ తెచ్చే పాత్రలు వస్తాయేమో చూడాలి.
కెరీర్, పర్సనల్ లైఫ్ విశేషాలు
ఈ భామకు ఇప్పుడు 37 ఏళ్ళు. మరాఠా సీనియర్ నటుడు శ్రీరంగ్ గాడ్బోలె తనయుడు సుహృద్ ని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సింపుల్ గా శారీలో కనిపిస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
చివరగా, గిరిజ ఓక్ కేవలం ఒక ఇంటర్వ్యూతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఆమె ప్రతిభకు, వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ ట్రెండింగ్ ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిద్దాం.


