
బిగ్‌బాస్ తెలుగులో కింగ్ నాగార్జున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై సీరియస్ అవుతున్నారు. రమ్య కల్యాణ్‌కు ‘అమ్మాయిల పిచ్చి’ ఉందని వ్యాఖ్యానించడంపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్య కామెంట్స్‌పై నాగార్జున స్పందన, కల్యాణ్ రియాక్షన్ ఈ ఎపిసోడ్‌లో కీలకంగా మారాయి.
Key Points
బిగ్‌బాస్‌లో రమ్య, కల్యాణ్ వివాదంపై నాగార్జున క్లాస్ పీకారు.
కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని రమ్య చేసిన వ్యాఖ్యలపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగ్ ప్రశ్నలకు కల్యాణ్‌పై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
ఈ ఎపిసోడ్‌తో కల్యాణ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న వ్యతిరేకతపై పూర్తి స్పష్టత లభించింది.
నాగ్ ఆగ్రహం: రమ్య కామెంట్స్‌పై సీరియస్
బిగ్‌బాస్ షోలో ( Bigg Boss Telugu 9 ) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున ( Nagarjuna Akkineni ) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది.
రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్ నిజానికి కల్యాణ్ ( Pawan Kalyan Padala ) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్.
కల్యాణ్‌పై రమ్య వ్యాఖ్యలు, వివాదం
ఫుల్ క్లారిటీ కల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం!
ప్రేక్షకుల స్పందన, కల్యాణ్ భవిష్యత్తు
నాగార్జున కౌంటర్, ప్రేక్షకుల స్పందనతో కల్యాణ్‌పై ఉన్న వ్యతిరేకతపై స్పష్టత వచ్చింది. ఆటపై దృష్టి సారిస్తే కల్యాణ్ విజేతగా నిలిచే అవకాశాలు మెరుగుపడతాయని నాగ్ సూచించారు.


