
📌 Key Points
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
- తాను సినిమా ఇండస్ట్రీ ప్రతినిధిగా సమ్మిట్‌కు వచ్చానని చిరంజీవి స్పష్టం చేశారు.
- సమ్మిట్ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు.
- హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సినిమా హబ్‌గా మార్చాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రసంగం చేశారు. తాను కేవలం చిరంజీవిగా కాకుండా, సినీ పరిశ్రమ ప్రతినిధిగా ఈ సమ్మిట్‌కు హాజరయ్యానని తెలిపారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా హబ్‌గా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆశయాన్ని ప్రశంసించారు.
సమ్మిట్‌కు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు వచ్చారు?
Chiranjeevi at Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడారు . రెండు రోజులు సమ్మిట్ లో మంగళవారం జరిగిన సినిమా రైజింగ్ 2047 సెషన్ లో ఆయన పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో నేడు పాల్గొన్న ఆయన ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు . అనంతరం ఈ సమ్మిట్ లో చిరంజీవి మాట్లాడుతూ .. “ ఇంతగొప్ప సదస్సులో తనని భాగం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమానికి పలిచేందుకు మంత్రులు వచ్చినప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ లో ఉన్నాను .
వారు నా దగ్గరి వచ్చే సమయానికి షూటింగ్ లో భాగంగా హీరోయిన్ తో డ్యాన్స్ చేస్తు ఉన్నాను . ఆ పరిస్థితులో వారిని చూస్తే కాస్తా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే షూటింగ్ ఆపేమని చెప్పి వారిని కలిస్తే అర్థమైంది . ఇంత గొప్ప సమావేశానికి నన్ను ఆహ్వానించాడానికి వచ్చారని అర్థమైంది . ఈ సమ్మిట్ కి నన్ను పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను . నేను చిరంజీవి కాబట్టి నన్ను ఆహ్వానించారని నేను అనుకోవడం లేదు . సినిమా ఇండస్ట్రీ నుంచి అన్ని తెలిసిన వ్యక్తి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను సినిమా ఇండస్ట్రీ ఏజెంట్ గా పిలిచారని అనుకుంటున్నారు . ఈ కార్యక్రమానికి చిరంజీవిగా రాలేదు . మూవీ ఇండస్ట్రీ ప్రభుత్వానికి రిప్రెజెంట్ చేసే వ్యక్తిగా వచ్చాను . హైదరాబాద్ ని సినిమా హబ్ గా మార్చడం ఇది గొప్ప మార్పు . ఇది సినిమా ఇండస్ట్రీ ఉన్న అభిమానం , ఇష్టంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ” అని పేర్కొన్నారు .
హైదరాబాద్ సినీ హబ్‌గా మారుస్తాం: చిరంజీవి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి
హైదరాబాద్ ని మరింత అభివృద్ధి పరిచాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ పేరుతో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం నిజంగా సంతోషించే విషయం . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కోసం సీఎంగా ఆయన చేస్తున్న కృషికి ఇది నిదర్శనం . ప్రపంచానికే అద్భుతమైన సినిమా హబ్ గా హైదరాబాద్ ని చేయడంలో మేమందరం ముందుంటాం . బాలీవుడ్ నుంచి కూడా అజయ్ దేవగన్ , సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ వచ్చిన ఇక్కడ అత్యాధునిక టేక్నాలజీ స్టూడియోలను లాంచ్ చేస్తామని చెప్పడం శుభారంభం . దీనికి అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ వంటి ఇతర హీరోలు , నిర్మాతలంత ముందుకు వచ్చిన చేయాలని ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉంది . వారంత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో పాటుపడి ఉన్నారనడంతో అతిశయోక్తి కాదు . తెలంగాణ రైజింగ్ పేరుతో సమ్మిట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డికి నా హ్యాట్సాఫ్ అన్నారు .
సినిమా రంగం ప్రభుత్వానికి ప్రతినిధిగా హైదరాబాద్‌ను గొప్ప సినిమా హబ్‌గా మార్చడంలో తామందరం ముందుంటామని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ చారిత్రక నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


