
📌 Key Points
- గోపీచంద్ కెరీర్‌లో 33వ చిత్రం ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల.
- సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం.
- శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
- ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరతవర్ష’ అనే మైథలాజికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. గ్లింప్స్ విడుదల కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గోపీచంద్ 33వ చిత్రం: ‘భరతవర్ష’
Gopichandh: సెలబ్రిటీ కిడ్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మ్యాచో స్టార్ గోపీచంద్ కెరియర్ తొలినాళ్లలో హీరోగా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. విలన్ పాత్రలతో చూపించిన హుందాతనం, ఇటు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కామెడీతనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అనే రేంజ్ లో ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో కథల ఎంపిక విషయంలో కాస్త తడిబడిన ఈయన సరైన సక్సెస్ అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్న గోపీచంద్.. తాజాగా మైథాలజీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
గోపీచంద్ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 33వ చిత్రంపై ఎట్టకేలకు సస్పెన్స్ కి తెరపడింది. ‘భరతవర్ష’ అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ను ఈ చిత్రానికి ఖరారు చేస్తూ తాజాగా గ్లింప్స్ ను విడుదల చేశారు.. “An untold chapter from a timeless age of Glory” అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇక క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఇందులోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత సినిమాల తరహాలోనే ఒక విలక్షణమైన పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మనకు ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టం అవుతోంది.
‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విశేషాలు
ఇకపోతే భరతవర్ష అనే టైటిల్ ని రివీల్ చేస్తూ తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చూస్తూ ఉంటే.. ఇది ఒక పీరియాడిక్ , మైథాలజీ నేపథ్యం కలగలిసిన ఆక్షన్ డ్రామా అని మాత్రం స్పష్టంగా అర్థమవుతింది. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ లుక్ సినిమాపై ఊహించని అంచనాలను పెంచేశాయి. ఘాజీ, అంతరిక్షం వంటి సినిమాలతో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఈసారి గోపీచంద్ ను ఒక భారీ కాన్వాస్ పై ఆవిష్కరిస్తూ దేశ చరిత్రలో ఎవరికీ తెలియని ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మస్తుండగా.. రీతు వర్మ హీరోయిన్ గా ఎంపికయింది. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అందిస్తున్న సంగీతం గ్లింప్స్ కే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
అసలే కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపీచంద్ కు భరతవర్ష రూపంలో ఒక సాలిడ్ హిట్ పడడం ఖాయమని.. గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దైవత్వాన్ని చూపిస్తూనే రణరంగంలో కత్తి పట్టి శత్రువులను ఛేదించే తీరును చాలా అద్భుతంగా మలిచారు. ముఖ్యంగా అటు గోపీచంద్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే అదిరిపోయే టైటిల్స్ తో ఉప్పొంగే లావాల అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు గోపీచంద్ . మరి ఈ సినిమాతో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తారో చూడాలి.
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామా
మొత్తానికి గోపీచంద్ కెరీర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. గ్లింప్స్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా గోపీచంద్ కు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.


