|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజం: విజయ్, సంగీత విడాకుల పిటిషన్‌లో 28 ఏళ్ల రహస్యం బట్టబయలు!

Published: 01-03-2026, 11:35 PM
షాకింగ్ నిజం: విజయ్, సంగీత విడాకుల పిటిషన్‌లో 28 ఏళ్ల రహస్యం బట్టబయలు!
  • విజయ్, సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారనే వార్త సంచలనంగా మారింది.
  • విజయ్, సంగీతలకు 1999 ఆగస్టు 25న చెన్నైలో వివాహం జరిగిందని అందరూ భావించారు.
  • విడాకుల పిటిషన్ ప్రకారం వారి మొదటి వివాహం 1998 జూలై 10న యూకేలో జరిగింది.
  • లండన్ లో సంగీత కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, ఆయన భార్య సంగీతల విడాకుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి వివాహం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

విడాకుల వార్తలతో సంచలనం

Vijay -Sangeetha:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడుగా పేరు దక్కించుకున్న ఈయన.. టీవీకే అనే పార్టీని స్థాపించి ఈసారి తమిళనాడులో జరిగే ఎన్నికలలో తన పార్టీని గెలిపించి, అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలలో తమ పార్టీని బలోపేతం చేయడానికి బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఒకవైపు ఆయన చివరి సినిమా ‘జననాయగన్’ విడుదల ఆగిపోవడం ఒక షాక్ అయితే.. మరొకవైపు సోషల్ మీడియాలో ఆయన సతీమణి సంగీత (Sangeetha) ఆయనకు విరుద్ధంగా విడాకులకు అప్లై చేసిందనే వార్త మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా విజయ్ దళపతిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కొంతమంది ప్రత్యర్ధులు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఒక బీజేపీ నాయకులు కూడా విజయ్ వ్యక్తిగత విషయంపై విమర్శలు చేసి చివరికి క్షమాపణలు కూడా కోరారు.

ఇలా ఒక్కొక్కటి ఆయనకు భారీ షాక్ తగిలిస్తున్న వేళ ఇప్పుడు మరో నిజం బయటపడింది. ముఖ్యంగా సంగీతతో వివాహం జరిగిన 28 ఏళ్ల తర్వాత ఆ విషయం బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ దళపతి ఆయన భార్య సంగీతల వివాహం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. గత 28 ఏళ్లుగా ప్రపంచానికి తెలిసిన వారి పెళ్లి తేదీకి.. అధికారికంగా జరిగిన పెళ్లి తేదీకి మధ్య ఏకంగా ఏడాది గ్యాప్ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ విషయం సంగీత తన విడాకులు పిటిషన్ లో ఈ విషయం వెల్లడించడంతో ఇది కాస్త బయటపడింది.

రహస్య వివాహం వెలుగులోకి

అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ నటుడు విజయ్ – సంగీతల వివాహం 1999 ఆగస్టు 25న చెన్నైలో ఘనంగా జరిగిందని అందరూ భావించేవారు. కానీ కోర్టు పిటిషన్ లో మాత్రం మరో తేదీని పొందుపరిచారు. విడాకుల పిటిషన్ లో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే.. విజయ్ – సంగీతల మొదటి వివాహం యునైటెడ్ కింగ్డమ్ లో 1998 జూలై 10న అధికారికంగా రిజిస్టర్ అయింది. అంటే చెన్నైలో అందరి సమక్షంలో వైభవంగా జరిగిన పెళ్లి కంటే ఏడాది ముందే వీరు అటు చట్టపరంగా భార్యాభర్తలయ్యారు. ఇకపోతే ఇలా లండన్ లో నివసిస్తున్న సంగీత కుటుంబ సభ్యుల సమక్షంలో అప్పట్లో ఈ రహస్య వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు విడాకుల ద్వారా బయటపడటంతో ఎందుకు ఈ ఏడాది పాటు ఈ విషయాన్ని దాచారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

పిటిషన్‌లో అసలు విషయం

నిజానికి విజయ్ దళపతి నటనను మెచ్చి .. సంగీత చెన్నైకి వచ్చి ఆయనను కలిసి ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక సంగీత కోసం కుటుంబ సభ్యుల సమక్షంలో లండన్లో వివాహం జరిగింది . కానీ అప్పుడే రహస్యంగా వివాహం చేసుకున్నారు అనే వార్త బయటకు వస్తే ఆయన కెరీర్ కు ఇబ్బంది ఏర్పడుతుందనే నేపథ్యంలోనే ఈ విషయాన్ని దాచినట్లు సమాచారం.. ఇక ఇప్పుడు విడాకుల పేరిట దాఖలైన పిటిషన్ లో అన్ని నిజాలు బయటపడుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి విజయ్, సంగీతల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.