
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలుపై పడిన అపవాదును తొలగించడానికి మీనా తన శక్తిమంతమైన పరిశోధనను ప్రారంభిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుణ చేసిన కుట్ర బయటపడుతుంది.
Key Points
మీనా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుణ కుట్రను బయటపెడుతుంది.
బాలుపై పడిన అపవాదు తొలగించబడుతుంది.
యూట్యూబర్ ద్వారా వైరల్ చేయబడిన వీడియో వెనుక నిజం బయటపడుతుంది.
మీనా యొక్క సీసీటీవీ పరిశోధన
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలుపై నింద పోగొట్టడానికి బార్‌కి వెళ్తుంది మీనా. అక్కడ నిలబడి ఉన్న మీనాను ఓ యూట్యూబర్ వీడియో తీస్తూ తాగడానికి వచ్చిందటూ ప్రచారం చేస్తాడు. ఆ యూట్యూబర్‌ను కొట్టి తరిమేస్తుంది మీనా .
బార్ ఓపెన్ చేశాక వెళ్లి ఓనర్‌తో మాట్లాడుతుంది మీనా. బాలుకు జరిగింది అంతా ఓనర్‌కు చెబుతుంది మీనా. ఇప్పుడు నేనేం చేయగలనమ్మా అని ఓనర్ అంటే.. ఇక్కడ ఏం జరిగిందో మీ సీసీటీవీలో తెలుస్తుంది కదా. ఆరోజు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మా ఆయన నిజంగా తాగాడా లేదా అనేది తెలుస్తుందని మీనా అంటుంది.
దాంతో సీసీటీవీ రూమ్ చూపించి వర్కర్‌కు మీనా అడిగిన రోజు ఫుటేజ్ చూపించని చెబుతాడు బార్ ఓనర్. డేట్ చెప్పి మీనా సీసీటీవీ చూస్తుంది. అందులో బాలు తాగకుండా కేవలం పెగ్ కలపడం, పొలిటిషియిన్ చికెన్ తినిమంటే తినడం, దాన్ని గుణ సీక్రెట్‌గా వీడియో తీయడం, తన మనిషితో కాలు అడ్డు పెట్టించడం అంతా రికార్డ్ అవుతుంది.
అదంతా చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా చేసింది ఆ గుణ గాడా. చేసిందంతా చేసి నా దగ్గరికి వచ్చి నీతి మాటలు మాట్లాడాడా. వాడికి ఉంటది అని అనుకుంటుంది మీనా. తర్వాత రవికి కాల్ చేసి రమ్మంటుంది. రవి వచ్చాకా ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా తన ఫోన్‌లోకి పంపించమని చెబుతుంది మీనా.
గుణ యొక్క కుట్ర బయటపడటం
అన్నయ్యపై ఇంత కుట్ర జరిగిందా. అప్పటికీ అన్నయ్య తాగలేదని చెబుతూనే ఉన్నాడు. మనమే వినలేదు అని రవి బాధపడుతాడు. పరిస్థితులు అలా పగబట్టేశాయి రవి. ముందు ఇదంతా మనం ఆయనకు చెబుతాం పదా అని బాలు దగ్గరికి వెళ్తారు మీనా రవి. బాలును చూడగానే వెళ్లి గుండెలపై పడి హగ్ చేసుకుంటుంది మీనా.
అది చూసి బాలు ఫ్రెండ్స్ అంతా పక్కకు తిరుగుతారు. నన్ను క్షమించండి. మీరు ఎంత చెప్పిన నేను నమ్మలేదు. మీరు తాగలేదు. మీపై ఆ గుణ గాడు కుట్ర చేశాడు అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది మీనా. అది చూసిన బాలు గుణపై కోప్పడతాడు. ఇదంతా పార్ట్ పార్ట్‌లుగా జరిగింది. దీన్ని ఎవడో మిక్స్ చేసి వైరల్ చేశాడు అని బాలు అంటాడు.
దాంతో బార్ ముందు తన వీడియో తీసిన యూట్యూబర్ మీనాకు గుర్తుకు వస్తాడు. ఇలాంటివి అలాంటి వాడే చేస్తాడని వాడి గురించి రవి, బాలు ఫ్రెండ్‌కు చెబుతుంది మీనా. దాంతో ఆ యూట్యూబర్‌ను పట్టుకుని తీసుకొస్తారు రవి వాళ్లు. వాన్ని నాలుగు బాది నిజం చెప్పిస్తారు. ఒకతను సీసీటీవీ ఫుటేజ్ పంపించి ఎడిట్ చేసి వైరల్ అయ్యేలా చేయమన్నాడు అని యూట్యూబర్ భయంతో చెబుతాడు.
ఏ వీడియోతో తనను తప్పుగా చూపించారో అలాంటి వీడియోతోనే ప్రజలందరికి తనపై కనువిప్పు కలిగేలా చేస్తానని బాలు అంటాడు. నేనంటే గిట్టని గుణ అనేవాడు నా వీడియో తీసి నేను తాగినట్లు మిమ్మల్ని అందరిని నమ్మించాడు. నేను తాగి కారు నడిపిస్తానని నమ్మకుంటే చాలు అని బాలు చేతులెత్తి దండం పెడుతూ రిక్వెస్ట్ వీడియో చేస్తాడు.
బాలుకు న్యాయం జరగడం
దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఆ వీడియోను సత్యం, ఎస్సై, ప్రజలంతా చూస్తారు. అప్పుడు బాలుది తప్పు లేదు. గుణనే కావాలని ఇరికించాడని అంతా అనుకుంటారు. వైరల్ వీడియో ద్వారా బాలు పేరు చెడగొడదామని చూసిన గుణ స్కెచ్ రివర్స్ అవుతుంది. సీసీటీవీ ఫుటేజ్‌తో గుణను మీనా గట్టిగా ఇరికిస్తుంది.
ఇక ఇదంతా చూసిన పోలీసులు ఒక అమాయకుడిని తప్పుగా చూపించి, అవమానించినందుకు గుణను అరెస్ట్ చేసి జైలులో పెడతారు. ఇదంతా తెలుసుకున్న మనోజ్, రోహిణి షాక్ అవుతారు. ఛ.. బాలును కొన్నేళ్లు ఈ విషయంపై మాటలు అందామంటే తప్పించుకున్నాడని నిరాశపడతారు మనోజ్ , రోహిణి.
ఇక బాలును ఇంట్లోవాళ్లు అన్నదానిపై సత్యం సీరియస్ అవుతాడు. బాలుపై జరిగిన కుట్రను మీనా బయటపెట్టింది. ఇప్పుడేమంటారు అని సత్యం నిలదీస్తాడు. దానికి ఏం చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోతారు సత్యం కుటుంబం. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
చివరికి సత్యం విజయం సాధించింది. గుణ చేసిన కుట్ర బయటపడి, బాలు నిర్దోషి అని నిరూపించబడి, గుణ జైలుపాలయ్యాడు. న్యాయం జరిగింది.


