|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: మీనాకు ఊహించని షాక్! మనోజ్‌కు మూడు లక్షలు కట్టాల్సిందే! సుగుణ గుట్టు రట్టు!

Published: 23-06-2026, 1:12 AM
గుండె నిండా గుడి గంటలు: మీనాకు ఊహించని షాక్! మనోజ్‌కు మూడు లక్షలు కట్టాల్సిందే! సుగుణ గుట్టు రట్టు!
  • బాలు సహాయంతో మీనాకు బ్యాంక్ అకౌంట్, చెక్ బుక్ లభ్యం; వ్యాపారం ప్రారంభం.
  • మనోజ్‌కు షాకింగ్ జీఎస్టీ నోటీస్; మూడు గంటల్లో మూడు లక్షలు కట్టాలనే వార్నింగ్.
  • స్కూల్‌లో సుగుణను చూసిన బాలు; ఆమె రహస్యం బయటపడే ఉత్కంఠ.
  • మీనా ఆర్థికంగా ఎదగడానికి బాలు ప్రోత్సాహం; భార్యాభర్తల బంధంలో కొత్త మలుపు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది! మీనాకు బాలు అదిరిపోయే బిజినెస్ ప్లాన్ తో షాకిచ్చాడు. మరోవైపు మనోజ్‌కు జీఎస్టీ అధికారులు ఊహించని షాక్ ఇవ్వగా, సుగుణ రహస్యం బయటపడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

మీనా బిజినెస్: బాలు మాస్టర్ ప్లాన్!

Gunde Ninda Gudi Gantalu Serial June 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 23వ ఎపిసోడ్‌లో మీనాకు కరెంట్ అకౌంట్ ఓపెని చేయించి చెక్ బుక్ వచ్చేలా చేస్తాడు బాలు. మనోజ్‌కు జీఎస్టీ అధికారులు నోటీసులు పంపిస్తారు. వచ్చి షాప్ సీల్ చేస్తామని 3 గంటల్లో 3 లక్షలు కట్టాలని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు నిప్పులు ఆర్డర్ పెట్టానని అటు అటు తిరుగుతుంటాడు. ఇంతలో ఒకతను వస్తాడు. మీరు అన్ని కాగితాలు తెచ్చారా. మీరు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టమంటే మా ఆవిడ అక్కడక్కడ పెడుతుందని బాలు అంటాడు.

బిజినెస్‌కు మంచి ఐడియా అది అని శ్రుతి, రవి అంటారు. నాకెందుకండి ఇవ్వన్ని అని మీనా అంటుంది. నువ్వు అంచలంచెలుగా ఎదిగి అందరి కళ్లల్లో నిప్పులు పోయాలని బాలు అంటాడు. బ్యాంక్ అతని చెప్పడంతో మీనా సంతకం పెడుతుంది. చెక్కు ఇస్తాడు. మీనా నువ్వు నిన్న నీకు వచ్చిన డెకరేషన్ డబ్బు లక్ష రూపాయలతోనే ఈ అకౌంట్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు ఇందులో నీ సంపాదన లక్ష రూపాయలు ఉన్నాయని బాలు అంటాడు.

మీకు భవిష్యత్తులో బిజినెస్ కోసం లోన్ కావాలంటే ఫ్రీగా ఇప్పస్తానని అతను చెప్పి వెళ్లిపోతాడు. ఇక జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాలని బాలు అంటాడు. దాంతో మీనా సంతోషంతో ఆనందబాష్పాలు పెట్టుకుంటుంది. ఏంటిది మీనా అని శ్రుతి అంటే.. భార్య ఎదగడానికి భర్త చేసే పని చూసి వస్తున్నాయి ఆ కన్నీళ్లు అని సత్యం అంటాడు.

మీనా చెక్ రాస్తుంది. దాంతో బాలు సెల్ఫీ తీసుకుంటాడు. షాప్‌కు మనోజ్, రోహిణి వెళ్తారు. మనోజ్ డల్‌గా ఉంటాడు. మీనా బిజినెస్ గురించి మాట్లాడుతాడు. వాళ్ల పని వాళ్లు చూసుకుంటున్నారు. నువ్వెందుకు కుళ్లుకుంటున్నావ్. ముందు మనది సరైన లెక్క లతో నడవాలి అని రోహిణి అంటుంది. తర్వాత జీఎస్టీ నోటీస్ చూసిన రోహిణి ఇది ఎప్పుడు వచ్చిందని కంగారుగా అడుగుతుంది.

మనోజ్‌కు జీఎస్టీ షాక్: 3 లక్షలు 3 గంటల గడువు!

పది రోజులు అవుతుందని మనోజ్ అంటాడు. నాకు ఎందుకు చెప్పలేదు అని రోహిణి అంటే.. 30 లక్షల టెన్షన్‌లో మర్చిపోయాను అని మనోజ్ అంటాడు. ఇది హోమ్ వర్క్ కాదు. లేట్ అయిందని చెప్పడానికి. నోటీస్ వచ్చినరోజే కట్టేయాలి. ఇప్పుడు వాళ్లకు ఇంట్లోకి, షాప్‌కి వస్తే అని రోహిణి అంటుంది. ఇంతలోనే జీఎస్టీ అధికారులు వస్తారు.

రేపటి వరకు టైమ్ ఇవ్వండని రోహిణి బతిమిలాడుకుంటుంది. 3 గంటల టైమ్ ఇస్తాం. ఆలోపు కట్టకుంటే షాప్‌కు సీల్ వేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు జీఎస్టీ అధికారులు. మనోజ్‌పై ఇప్పుడేం చేద్దాం చెప్పు అని తిడుతుంది రోహిణి. మీ మలేషియా మావయ్యను అడుగు. ఈసారికి కాపాడు అని బతిమిలాడుకుంటాడు మనోజ్.

సరే ట్రై చేస్తాను అని రోహిణి అంటే.. నువ్వే దిక్కు నాకు అని మనోజ్ అంటాడు. ఇక ఏ నోటీసు వచ్చిన ముందుగా నాకు చూపించు అని వెళ్లిపోతుంది రోహిణి. 3 గంటలు, 3 లక్షలు అని భయపడిపోతాడు బాలు. మరోవైపు స్కూల్‌కి సత్యం వెళ్తాడు. బాలు డ్రాప్ చేస్తాడు. లంచ్ బాక్స్ మర్చిపోతే పిలిచి ఇస్తాడు. బుధవారమేగా వచ్చేది. ఇవాళ ఎందుకు వచ్చావని బాలు అంటాడు.

ఇంతలో రోహిణి కాల్ చేస్తుంది. చింటుకు చాక్లెట్స్ ఇప్పిస్తానని తీసుకెళ్తాడు బాలు. చింటు కూడా వెళ్తాడు. పక్కకు వెళ్లి రోహిణితో సుగుణ మాట్లాడి బాలు చూసిన విషయం చెబుతుంది. అతనికేమైనా అనుమానం వచ్చిందా అని రోహిణి అడిగితే..లేదు. ఇంకో ఐదు నిమిషాలు ఉంటే తెలుస్తుందని, బాలుతో చింటు వెళ్లాడు అని చెబుతుంది సుగుణ.

చింటు ఏం చెబుతాడో అని రోహిణి భయపడుతుంది. ఇప్పుడు ఇది ఇంకో సమస్య అని అనుకుంటుంది. సరే ఇంటికెళ్లి నా నగలు తీసుకుని విద్య ఇంటికి రా అని రోహిణి చెబుతుంది. సరేనని సుగుణ అంటుంది. బాలు, చింటు వస్తారు. మిమ్మల్ని మీనా బాగా అడుగుతుంది. మాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. పరిస్థితులు చెప్పరు. ఈసారి మీనాను తీసుకొస్తాను తప్పించుకోకండి అని బాలు అంటాడు.

సుగుణ సీక్రెట్: బాలుకు చిక్కిందా?

అయితే, మీ గురించి తెలుసుకోవాలి. దానికి ఒకరోజు మీ ఫోన్ నా దగ్గర ఉంచుకుంటాను అని విద్య అడగ్గానే వెంటనే మురళి తీసి ఇస్తాడు. విద్య ఆశ్చర్యపోతుంది. తర్వాత ఫోన్ పాస్‌వర్డ్ చెప్పి, బిర్యానీ ఇచ్చి వెళ్లిపోతాడు మురళి. మీనాకు చెబుదామని కాల్ చేసి మీనా ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని, అడిగిన వెంటనే ఇచ్చేశాడు అని, అడిగితే ప్రాణాలు అయిన ఇచ్చేస్తానంటున్నాడు అని విద్య చెబుతుంది.

ఒక్కరోజు కాదు నెలరోజులు అయిన ఉంచుకోమన్నాడు. పరీక్షలు ఇప్పుడే మొదలయ్యాయని విద్య అంటుంది. ఫోన్‌లో చాలా మంది రహస్యాలు ఉంటాయి. అడిగిన వెంటనే ఇచ్చేశాడు అంటే.. అతనికి రహస్యాలు లేవు. లేదా నిన్ను చాలా ఇష్టపడుతున్నాడేమో. ఇప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, కోపం ఎప్పడు వస్తుంది. ఇతరులతో ఎలా మాట్లాడుతాడు వంటివి తెలుసుకోవాలని మీనా చెబుతుంది.

ఏదోలా మాట్లాడి తప్పించుకున్నాం. పాపం ఆ అబ్బాయి చాలా ఆప్యాయంగా ఉన్నాడు అని అంటుంది సుగుణ. ఇంతలో రోహిణి వచ్చి తీసుకొచ్చావా అని అడుగుతుంది. చింటు కోసం దాచిన నగలు చూపిస్తుంది సుగుణ. దేనికి అని విద్య అడిగితే మనోజ్ చేసింది చెబుతుంది రోహిణి. షో రూమ్ మూస్తానని అన్నారు అని రోహిణి అంటుంది.

నేను తీసుకొచ్చాను కానీ నాకు నచ్చలేదు. చింటు కోసం చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా దాస్తూ వచ్చాను. వాడి భవిష్యత్తు కోసం. ఇప్పుడు బ్యాగ్ తీసుకొస్తుంటే నా చేతులు వణికాయాని సుగుణ అంటుంది. నాకు కూడా బాధే. ఇప్పుడు షో రూమ్ పోతే మళ్లీ నా బతుకు రోడ్డు మీదకు వస్తుంది. ఈ నగలు తాకట్టుపెట్టాలి. నీ అకౌంట్ మీద అని విద్యతో అంటుంది రోహిణి .

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈ ట్విస్టులు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. మీనా, బాలు, మనోజ్, సుగుణల జీవితాల్లో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.