|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: రోహిణి షాకింగ్ గతం లీక్! మ‌నోజ్ చేతికి చిక్కిన సీక్రెట్ లెటర్!!

Published: 03-02-2026, 11:05 PM
గుండె నిండా గుడి గంటలు: రోహిణి షాకింగ్ గతం లీక్! మ‌నోజ్ చేతికి చిక్కిన సీక్రెట్ లెటర్!!
  • చింటును దత్తత తీసుకోకుండా రోహిణి ప్రయత్నాలు, మ‌రోవైపు మనోజ్ చేతికి రోహిణి గ‌తం తెలిపే లేఖ!
  • బాలు, మీనా ద‌త్త‌త‌కు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభావతి!
  • రోహిణి ప్లాన్ రివ‌ర్స్ చేసిన ప్ర‌భావ‌తి.. చింటును అడ్డుగా చూపి ముగ్గురినీ గెంటేస్తానంటూ షాకింగ్ కామెంట్స్!
  • రోహిణి గ‌తం గురించి మ‌నోజ్‌కు చేతికి చిక్కిన లేఖ‌.. దినేష్ ప‌నిగా అనుమానం!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్! రోహిణి గతంపై ఒక సంచలన లేఖ బయటపడింది. అసలు ఆ లేఖలో ఏముంది? ఇది సీరియల్ లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

రోహిణి అసలు రంగు బ‌య‌ట‌ప‌డుతుందా?

గుండె నిండా గుడి గంటలు బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ లో చింటుని ఎట్టి పరిస్థితుల్లోనూ దత్తత తీసుకోకుండా రోహిణి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అయితే ఆమె గతంపై ఓ వ్యక్తి మనోజ్ చేతికి ఓ లెటర్ ఇచ్చి వెళ్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 612వ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టుల ఉన్నాయి. చింటు దత్తత కోసం బాలు, మీనా ప్రయత్నించడం, దానికి అడ్డుకట్ట వేయడానికి రోహిణి ప్రయత్నాలు, ప్రభావతి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

సుగుణ దగ్గరికి బాలు, మీనా..

చింటుని దత్తత తీసుకుంటామన్న మీనా..

చింటు ద‌త్త‌త వెనుక అస‌లు నిజాలు ఏంటి?

తన తర్వాత చింటు పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందానని, ఆ దేవుడు మీ రూపంలో పంపించాడని సుగుణ అంటుంది. అయితే ఈ విషయం తన కూతురిని అడిగి చెబుతానని అంటుంది. సరే అని వాళ్లు వెళ్లిపోతారు.

రోహిణికి సుగుణ ఫోన్.. నోటికొచ్చినట్లు మాట్లాడిన కూతురు

తానెలా తిడతానని, వాళ్లు చింటు పట్ల నీకన్నా బాధ్యతగా ఉన్నారని, ఆ ఇంటికి వస్తే నీ కళ్ల ముందే చింటు ఉంటాడు కదా అని చెబుతుంది. అది విని రోహిణి మండిపడుతుంది. నీకు ఇప్పుడు నా కొడుకు భారమయ్యాడా.. వదిలించుకుందామని చూస్తున్నావా.. నా ఇంటికి వచ్చి వాడు నన్ను అమ్మ అని పిలిస్తే పరిస్థితి ఏంటి అని రోహిణి నానా మాటలు అంటుంది.

ప్రభావతిని రెచ్చగొట్టాలని చూసిన రోహిణి

ప్ర‌భావ‌తి ప్లాన్ రివ‌ర్స్.. రోహిణికి షాక్!

ప్రభావతి మాత్రం రివర్స్ అవుతుంది. వాళ్లు దత్తత తీసుకుంటే తీసుకోని.. వాళ్లకే ఇక్కడ గతి లేదు.. అతన్ని సాకుగా చూపించి ముగ్గురినీ ఇంట్లో నుంచి గెంటేస్తానని ప్రభావతి అనడంతో రోహిణి షాక్ తింటుంది. అదే జరిగితే చింటు కూడా రోడ్డున పడతాడు.. మరో ప్లాన్ ఆలోచించాలని అనుకుంటుంది.

చింటు కోసం కొత్త స్కూల్.. దత్తత తీసుకోవాలన్న విద్య

వాళ్లను ఇక్కడికి తీసుకురావడమే మంచిది.. ఇక్కడ బాలు, మీనా కంటపడకుండా చూసుకుంటానని రోహిణి అంటుంది. మధ్యలో అయినా స్కూల్లో సీటు ఇస్తారా అని స్కూలు వాళ్లను అడిగితే ఇస్తామని వాళ్లు చెబుతారు. దీంతో అందుకు రోహిణి ఏర్పాట్లు చేసి అదే విషయం సుగుణకు ఫోన్ చేసి చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది.

ఇటు హాల్లోనే బాలు, మీనా రొమాన్స్ కు రెడీ అవుతుంటారు. అటు మేడ మీద ప్రభావతికి మనోజ్ మరో షాకిస్తాడు. రోహిణి గతం గురించి ఎవరో తనకు లెటర్ ఇచ్చి వెళ్లారని చెబుతాడు. మరో లెటరా అని ఆమె షాక్ తింటుంది. రోహిణిని పిలిచి ఆ లెటర్ చూపిస్తే ఇది దినేష్ చేసిన పనే కావచ్చని ఆమె ఆందోళన చెందుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరింత ఉత్కంఠగా మారుతోంది. రోహిణి గతం ఏమిటో తెలుసుకోవాలంటే, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.