
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో నేటి ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్: ప్రభావతి చేతిలో పూల గంప!
- రోహిణి కొంప ముంచిన బామ్మగారు, మరోవైపు బాలు ఫోన్ చూసేసిన మీనా.. ఏం జరగనుందో చూడాలి మరి!
- ఫామ్ హౌజ్‌లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన కామాక్షి ఫ్రెండ్.. గుణ ప్లాన్స్ సక్సెస్ అవుతాయా?
- ప్రభావతికి పూలు అమ్మించాలని మీనా ప్లాన్, రవి-శృతిల మధ్య చిచ్చు పెట్టిన సుశీలమ్మ!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్! ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. సీరియల్ కథనం మరింత ఉత్కంఠగా మారింది.
ప్రభావతి పూల వ్యాపారం వెనుక మీనా ప్లాన్!
Gunde Ninda Gudi Gantalu Serial February 26th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో ప్రభావతి నెత్తిపై పూలగంప పెట్టి పూలు అమ్మిస్తారు. కామాక్షి ఫ్రెండ్ ఫామ్ హౌజ్‌లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. గుణ వచ్చి రోహిణిని ఎలాగైనా వీడియో తీసుకురమ్మని చెబుతాడు. బాలు ఫోన్ తీసుకుంటుంది రోహిణి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అందరూ త్వరగా పడుకోండని, ఉదయాన్నే ప్రభావతి పూలమ్ముకుని తిరుగుతుంది అని బాలు అంటాడు. అంతా పైకి వెళ్తారు. నిజంగా నాతో పూలు అమ్మిస్తారా అని సత్యంతో ప్రభావతి అంటుంది. మీనా ఓడిపోతే పూలు అమ్మటం మానిపించేదానివిగా. అందుకే బాలు ఇలా చేయిస్తున్నాడని సత్యం అంటాడు.
టెడ్డీ బేర్‌లో నీతూను చూసుకుని రవి చేయి వేసి మాట్లాడటంతో శ్రుతి కొడుతుంది. తర్వాత ఇద్దరు కలిసిపోతారు. మరోవైపు మీనా, శ్రుతి గొడవ గురించి సుశీలకు చెబుతాడు బాలు. అదా సంగతి ఇద్దరు కలిసి ప్రభావతిని వెర్రిబాగలదాన్ని చేశారా అని మీనాను పొగుడుతుంది సుశీల. సంజును ఎలా ఒప్పించావ్ అని బాలు అడిగితే.. కొందరికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే చేశా అని మీనా అంటుంది.
మీ చెల్లి చల్లగా ఉండాలంటే మీరు అతనితో గొడవ పడొద్దు. అతను కలిసినా కలవకున్నా మీరే బుద్ధిగా ఉండి అన్ని కావాల్సినవి చూసుకోవాలని మీనా అంటుంది. వాడు దున్నపోతు మీనా. దున్నపోతు మీద వాన పడినట్లే అని సంజును అంటాడు బాలు. ఒక్కసారి అతన్ని క్షమించమని అడగమని సుశీల అంటుంది. సరే నేను ప్రేమించే ఇద్దరు డార్లింగ్స్ చెబుతున్నారు. చెబుతా అని బాలు అంటాడు.
రోహిణికి ఊహించని కష్టం – కారణం ఎవరు?
అదంతా చూసి మీనా, సత్యం, బాలు నవ్వుతారు. వెంటనే లేచి ఇదంతా నా కల అని పడుకుంటుంది ప్రభావతి. మరుసటి రోజు ఉదయం పూలగంప ఇచ్చి నెత్తిమీద పెట్టుకుని మార్కెట్‌కు వెళ్లమని ప్రభావతికి చెబుతారు. ఆ ఐడియా అంతా మీనాదే అని తిట్టేసరికి ఇప్పుడు చెబుతున్నా మీరు ఈ పూలు అమ్మాలని, ఫొటోలు తీయాలని మీనా అంటుంది.
మర్యాదగా అమ్మమని సుశీల చెబుతుంది. దాంతో నెత్తిమీద పూలగంప పెట్టుకుని ప్రభావతి అరుస్తూ అమ్ముతుంది. రవి, శ్రుతి ఫొటోలు వీడియోలు తీస్తారు. ఇక చాలు లెండని ఆపుతుంది మీనా. ఏంటే నిజమా, నాతో పూలు అమ్మించట్లేదా అని ప్రభావతి అంటుంది. లేదు నేను ఎలా అమ్మిస్తానని మీనా అంటుంది. ఈరోజు నువ్వు నా కళ్లకు మధుర మీనాక్షిలా, దేవతలా కనిపిస్తున్నావని ప్రభావతి అంటుంది.
శ్రుతి తల్లి శోభన కూడా వస్తుంది. మమ్మీ ఎప్పుడు పుల్లలు వేసి వెళ్తావుగా. ఈ పుల్ల తీసుకో అని శ్రుతి అంటుంది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ మయూక కామాక్షిని బామ్మ అని పిలుస్తుంది. విద్య వచ్చి రోహిణితో గుణ కాల్ చేయమన్నాడని చెబుతుంది. దాంతో రోహిణి కాల్ చేస్తే.. బాలు ఫోన్ నుంచి వీడియో కొట్టేయమని, ఫామ్ హౌజ్ పక్కనే ఉన్నానని గుణ చెబుతాడు.
బాలు ఫోన్ సీక్రెట్‌గా చూసిన మీనా!
సరేనని రోహిణి అంటుంది. బాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోతాడు. ఆ ఫోన్ దగ్గరికి రోహిణి వెళ్లి వెతుకుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి బొమ్మల కొలువులో మనమే ముందు కూర్చోవాలని తీసుకెళ్తాడు. తర్వాత రోహిణిని పిలిచిన సుశీల నీకు కడుపు పోయిందట కదా అని అడుగుతుంది. దాంతో అంతా ఇబ్బందిపడతారు. మీనానే చెప్పి ఉంటుందని ప్రభావతి తిడుతుంది.
ఏంటే ఈవిడ (బామ్మ సుశీల) నీ కొంప ముంచేలా ఉందని విద్య అంటుంది. ఆ డాక్టర్‌కు దొరకకుండా తప్పించుకోవాలని రోహిణి అంటుంది. ప్రభావతి వచ్చి మీనా కంటే ముందు నువ్వే పిల్లలను కనాలి. గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లిపోతుంది. ఏంటో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతుంది రోహిణి.
మరోవైపు రాజేష్‌కు ఫోన్ చేయాలని ఫోన్ కోసం వెతుకుతాడు బాలు. ఛార్జింగ్ పెట్టినచోట లేదని మీనాకు చెబుతాడు. ప్రభావతి, మనోజ్ దొంగతన చేసి ఉంటారని బాలు అంటాడు. వాళ్లను దొంగలను చేశారు కదండి అని బాలు ఫోన్‌కు కాల్ చేస్తుంది మీనా .
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి మరెన్నో అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం!


