
స్టార్ మా లో ప్రసారమయ్యే “గుండె నిండా గుడి గంటలు” సీరియల్ లోని జులై 15వ తేదీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రవి కోసం ప్రభావతి చేసిన నిరాహార దీక్ష, బాలు ఇచ్చిన సర్‌ప్రైజ్, మరియు రవి పంపిన బిర్యానీ ఈ ఎపిసోడ్ లోని ముఖ్య హైలైట్స్.
Key Points
రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష!
బాలు తల్లికి సర్‌ప్రైజ్!
రోహిణి తండ్రి అదృశ్యం రహస్యం!
ప్రభావతి నిరాహార దీక్ష
స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు జులై 15 ఎపిసోడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఈ 767వ ఎపిసోడ్ లో రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష, ఆమెను చూసి అందరూ పస్తులు ఉండటం, అటు శృతికి రవి బిర్యానీ పట్టుకెళ్లడం, ఇటు తల్లి కోసం బాలు ఇచ్చే సర్‌ప్రైజ్ లతో ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంది. ఇక రోహిణి తండ్రి అదృశ్యం గురించి కొత్త డ్రామా మొదలవుతుంది.
ఎపిసోడ్ మనోజ్.. రోహిణి తో కలిసి హాలులోకి వచ్చే సన్నివేశంతో ఆరంభమవుతుంది. మనోజ్ కిందికి వస్తూ.. “మీనా ఇంకా వంట చేయలేదా?” అని రోహిణిని అడుగుతాడు. “నాన్నా, బాగా ఆకలేస్తోంది” అని సోఫాలో కూర్చున్న సత్యంతో మనోజ్ అంటాడు. సత్యం ఆగ్రహంగా.. “ఎప్పుడూ తిండి గురించే ఆలోచిస్తావా? ఈ వయసులో జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటావా?” అని నిలదీస్తాడు.
మనోజ్ స్పందిస్తూ.. “కెనడాలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, నాన్నా!” అని సమాధానమిస్తాడు. బాలు కూడా వచ్చి, “14 లక్షలు కట్టి బాస్‌కు జీతం ఇచ్చే జాబ్ చేయాలనుకుంటున్నావా? ఇప్పటికే లక్షలు మింగేసి మమ్మల్ని రోడ్డున పడేశావు” అని కౌంటర్ ఇస్తాడు. “నీ మలేషియా మామయ్య డబ్బు ఇస్తాడని ఊహించుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు” అని హెచ్చరిస్తాడు. కనీసం పార్క్ లో పల్లీలైనా అమ్ముకొని బతకరా అంటూ ఆటపట్టిస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఇవేమీ పెద్దగా పట్టించుకోడు.
మీనా టిఫిన్ సిద్ధం చేసి అందరినీ పిలుస్తుంది. బాలు, మనోజ్, రోహిణి, సత్యం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. బాలు సందేహంగా.. “అమ్మ ఎక్కడ, మీనా?” అని అడుగుతాడు. “గదిలోనే ఉంది, టిఫిన్‌కు రమ్మని చెప్పినా ఏమీ చెప్పకుండా తలుపు మూసేసింది” అని మీనా చెబుతుంది.
అంతలో ప్రభావతి కోపంగా వచ్చి.. “నా కొడుకు రవిని, కోడలు శృతిని ఇంటి నుంచి గెంటేసి, మీరు ప్రశాంతంగా కడుపు నిండా తింటారా?” అని మండిపడుతుంది. బాలు, మనోజ్, “అమ్మా, నువ్వూ తిను!” అని బతిమిలాడతారు. కానీ ప్రభావతి మాత్రం “రవి ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను నీళ్లు కూడా తాగను” అని నిరాహార దీక్ష ప్రకటిస్తుంది.
బాలు సర్‌ప్రైజ్
ప్రభావతి నిరాహార దీక్షతో కుటుంబం ఆందోళనకు గురవుతుంది. సత్యం, మనోజ్, రోహిణి, మీనా ఆమెను ఒప్పించేందుకు చాలా సేపు ప్రయత్నిస్తారు. కానీ ప్రభావతి, “నా కొడుకు రవి వచ్చే వరకు నేను తినను” అని పట్టుబడుతుంది.
సత్యం కూడా “నువ్వు తినకపోతే నేనూ తినను” అని ప్రభావతితో అంటాడు. దీంతో రోహిణి, మనోజ్ కూడా తినడానికి నిరాకరిస్తారు. అటు మీనా.. బాలును, “అత్తయ్యను తినిపించేలా ఏదైనా ప్లాన్ చెయ్యి” అని చెబుతుంది. కుటుంబం మొత్తం పస్తులతో ఆపసోపాలు పడుతుంది.
అటు శృతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తాడు రవి. ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు కదా.. అందుకే తీసుకొచ్చాను శృతితో రవి అంటాడు. మీ హోటల్లో ఆర్డర్ పెడితే నువ్వే తీసుకొస్తావని తెలిసే చేశానని శృతి అంటుంది. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు.
ఈ సందర్భంగానే డబ్బింగ్ తర్వాత ఇంటికెళ్దామని శృతితో రవి అంటాడు. బాలు వచ్చాడని, మన కోసం అతడు ఒక అడుగు దిగి వచ్చాడు కదా అని రవి చెబుతాడు. మీనా వదిన కూడా వచ్చిందని శృతి కూడా చెబుతుంది.
రోహిణి తండ్రి అదృశ్యం
బాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు బయటకు వెళ్లి బిర్యానీ తెస్తాడు. “అందరం కలిసి బిర్యానీ తిందాం” అని పిలుస్తాడు. మనోజ్ ఆకలితో అలమటిస్తూ.. “బిర్యానీ చూస్తే ఆకలి రెట్టింపవుతోంది” అని అంటాడు. కానీ ప్రభావతి మళ్లీ తినడానికి నిరాకరిస్తుంది. “ఈ బిర్యానీ నేను కొనలేదు, రవి పంపాడు. అతను రెస్టారెంట్‌లో నువ్వు తినడం లేదని బాధపడి, ఇంట్లో అందరికీ బిర్యానీ స్వయంగా వండి పంపాడు” అని చెబుతాడు.
దీంతో ప్రభావతి.. “అంత ప్రేమ ఉంటే రవి స్వయంగా రావచ్చు కదా?” అని అడుగుతుంది. సత్యం జోక్యం చేసుకొని.. “వాడు వచ్చే సమయంలో వస్తాడు, ఇప్పుడు తిందాం” అని ఒప్పిస్తాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో అందరూ తినడానికి సిద్ధమవుతారు. దీంతో ప్రభావతి స్పందిస్తూ.. తన కొడుకు పంపిన బిర్యానీ తాను తినకుండా మీరంతా ఎలా తింటారంటూ రుసరుసలాడుతూ వచ్చి తినడానికి కూర్చొంటుంది.
బిర్యానీ తింటూ ఉండగా, ప్రభావతి మళ్లీ రోహిణి తండ్రి అదృశ్యం గురించి అడుగుతుంది. “రోహిణి, నీ నాన్న ఇంకా ఎక్కిన ఫ్లైట్ ఆకాశంలోనే తిరుగుతోందా?” అని సెటైర్ వేస్తుంది. రోహిణి మౌనంగా ఉండి, ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇంతలో బాలు కలగజేసుకోవడంతో ఆమె ఆ టాపిక్ అక్కడితో వదిలేస్తుంది.
అయితే అందరూ తినడం పూర్తయిన తర్వాత రోహిణి గదికి వెళ్లి బిర్యానీ అరిగిందా అని అడుతుంది. మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలోనే గద్దలా తిరుగుతోందా అని ప్రభావతి నిలదీస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి తండ్రిని మలేషియాలో అరెస్ట్ చేశారన్న కొత్త డ్రామా మొదలైనట్లు చూపించి ఆసక్తి రేపారు.
ఈ ఎపిసోడ్ లోని ఉద్రేకభరిత సన్నివేశాలు మరియు కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవి తిరిగి రావడం, రోహిణి తండ్రి అదృశ్యం వెనుక ఉన్న రహస్యం తెలియడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.


