|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: మీనా వర్సెస్ శ్రుతి.. రచ్చ రచ్చ! తల్లికి ప్రమాదం.. షాకింగ్ ట్విస్ట్!

Published: 29-01-2026, 11:35 PM
గుండె నిండా గుడి గంటలు: మీనా వర్సెస్ శ్రుతి.. రచ్చ రచ్చ! తల్లికి ప్రమాదం.. షాకింగ్ ట్విస్ట్!
  • గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మీనా, శ్రుతి మధ్య తీవ్ర గొడవలు!
  • శోభ మీనాతో వాగ్వాదం: కూతురు కాపురం కూల్చేస్తావంటూ ఫైర్!
  • ప్రభావతి ప్లాన్ సక్సెస్: ఆనందంతో డ్యాన్స్, మరింత డ్రామా!
  • రోహిణి తల్లికి ప్రమాదం! కళ్యాణి ఫోన్ కాల్, టెన్షన్ వాతావరణం!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మీనా, శ్రుతి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

మీనా, శ్రుతి మధ్య మాటల యుద్ధం!

గుండె నిండా గుడి గంటలు జనవరి 30 ఎపిసోడ్‌లో మీనాను శోభ నానా మాటలు అనేసి వెళ్తుంది. అది చూసిన బాలుకు నిజం తెలిసి కోపంతో ఊగిపోతాడు. రవి, శ్రుతితో మీనా, బాలు గొడవ పడతారు. బాలు కంటే మీనా గయ్యాలని శ్రుతి అంటుంది. అదంతా చూసి తన ప్లాన్ సక్సెస్ అయిందని ఆనంద తాండవం చేస్తుంది ప్రభావతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనకు చెప్పి శ్రుతిని మందలిస్తే శ్రుతి మీనాకు దూరంగా ఉంటుందనుకుంటుంది ప్రభావతి. కానీ, శ్రుతిని ఏమనలేనని శోభన వెళ్లిపోతుంది. రోహిణికి కాల్ వస్తే వెళ్లి మాట్లాడుతుంది. కల్యాణినా మాట్లాడేది. ఇక్కడ ఒకావిడ పడిపోయింది. ఆమె పేరు సుగుణమ్మా అని చెబుతారు.

పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని కవర్ చేస్తాడు ప్రేమ్ కుమార్. ప్రభావతి సరేనంటుంది. అలా లవర్స్ ఇద్దరు తప్పించుకుంటారు. శోభకు దారిలో మీనా కనిపించడంతో కారు ఆపి వెళ్లి పలకరిస్తుంది. మీరా బాగున్నారా అని మీనా అంటే.. ఆ ఇంట్లో నువ్వున్నంత సేపు ఎవరు బాగుంటారు అని శోభ అంటుంది. మీ బాగుకు నేనేం అడ్డొచ్చాను అని మీనా అంటుంది.

శ్రుతితో కలిసి ఇంట్లో గొడవలు పెడుతున్నావట. నీలాంటి వాళ్లతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. దాన్ని ఎందుకు చెడగొడుతున్నావ్ అని శోభ అంటుంది. శ్రుతి చాలా తెలివైనది. అలాంటి శ్రుతి మీలాంటి వాళ్ల కడుపులో ఎలా పుట్టిందా అని ఆశ్చర్యమేస్తుంది. శ్రుతికి నేను అక్కలా ఉంటున్నా అని మీనా అంటుంది.

ప్రభావతి ప్లాన్ సక్సెస్.. ఆనంద తాండవం!

ఫంక్షన్‌లో జరిగిన హారం దొంగతనం గురించి శోభ అంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి అని అని మీనా అంటుంది. నీలాంటి వాళ్లతో గొడవ పెట్టుకోడానికి రాలేదు. నా కూతురు కాపురం గురించి మాట్లాడేందుకు వచ్చాను. మీ అత్తే ఇవన్ని చెప్పింది. నీ మొగుడు తాగుడుకు లేకుంటే నన్ను డబ్బు అడగండి ముష్టి పడేస్తాను అని శోభ అంటుంది.

ఇదే మాట ఇంకెవత్తైనా అంటే ఇటుక రాయిలతో కొట్టేదాన్ని, ముక్కు, మోహం ఏకం చేసేదాన్ని అని మీనా వార్నింగ్ ఇస్తుంది. నీలాంటి వాళ్లతో నాదే బుద్ధి తక్కువ అని శోభ అంటే.. తక్కువ కాదు అసలు ఉంటే కదా అని మీనా అంటుంది. దాంతో శోభ వెళ్లిపోతుంది. ఇంతలో బాలు వచ్చి ఏమైందని అడుగుతాడు. మీనా చెప్పకపోవడంతో పక్కనున్న ఆవిడ మొత్తం చెబుతుంది.

ఎవరో పనిపాట లేనివాళ్లు పుల్లలు పెడుతున్నారని తెలిసి అని రవి అంటుంది. శోభతో మాట్లాడింది రవికి చెబుతుంది ప్రభావతి. ఇంతలో రవి వచ్చి డబ్బుడమ్మా అని అరుస్తూ వస్తాడు బాలు. తాడో పేడో తేల్చుకుందాం, అందరికి నేనే కనిపిస్తున్నానా, తల్లిని బట్టే కూతురు, పదా తేల్చుకుందామని బాలు, మీనా శ్రుతి దగ్గరికి వెళ్తారు. అక్కా చెల్లెళ్లా కలిసి ఉండేవారు. ఏమైందో అనుకుంటూ రవి వెళ్తాడు.

రోహిణి తల్లికి ప్రమాదం.. ఏం జరగబోతోంది?

నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయిందే అనుకుంటుంది ప్రభావతి . పైన బాలు, మీనా-రవి, శ్రుతి గొడవ పడినట్లు డ్రామా చేస్తారు. అరుస్తారు. అదంతా విన్న ప్రభావతి ఆనందంతో తాండవం చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంటుంది. ఆనందం తన్నుకొస్తుందే అని ప్రభావతి అనుకుండగా సత్యం వస్తాడు. ఏమైందని అడిగితే చాలా సంతోషంగా చెబుతుంది ప్రభావతి.

అందుకే నేను చెప్పాను కదమ్మా నీ స్థాయి వాళ్లతో మాట్లాడాలని అని ప్రభావతి అంటుంది. మీ మాటే వినాల్సింది. ఎవరు ఏంటో ఇప్పుడే బాగా అర్థమైంది అని శ్రుతి అంటుంది. అయితే ఇకనుంచి టీ కాఫీకి, భోజనానికి నన్ను అడగొద్దు. ఈవిడనే అడుగు అని మీనా వెళ్లిపోతుంది. అడుగుతాను అని శ్రుతి అంటుంది.

ఇద్దరు గొడవ పడితే వంట నా మీద పడిందే. కానీ, వీళ్లిద్దరు అయితే గొడవ పడ్డారు. ఇకనుంచి దూరంగా ఉంటారు అని సంతోషిస్తుంది ప్రభావతి అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.