
నిన్ను కోరి సీరియల్ జూలై 7వ తేదీ ఎపిసోడ్‌లో విరాట్ మరియు చంద్రకళ మధ్య ప్రేమ బయటపడుతుంది. కామాక్షి మరియు శృతిల వ్యాపారం విఫలమవుతుంది. అమ్మవారి నగలు దొంగతనం అవుతాయా? శాలిని దీని వెనుక ఉందా?
Key Points
విరాట్ చంద్రకళ ప్రేమను గుర్తిస్తాడు.
కామాక్షి, శృతిల వ్యాపారం విఫలమవుతుంది.
జగదీశ్వరి స్నేహితులు అమ్మవారి నగలు సమర్పించడానికి సహాయం కోరుతారు.
శాలిని అమ్మవారి నగలు కొట్టేందుకు పన్నాగం పన్నుతుందా?
విరాట్ మరియు చంద్రకళ మధ్య ప్రేమ
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ గీసిన ఫొటోను చూస్తూ విరాట్ మురిసిపోతాడు. అమ్మ ప్రేమని కలవరిస్తూ చాలా ప్రేమగా ఫోటోని చూస్తూ విరాట్ ఉంటుండగా ఇంతలో చంద్రకళ అక్కడికి వచ్చి చూస్తుంది.
చూసావా బావ తల్లి ప్రేమను ఎవరు ఈ ప్రపంచంలో తీసివేయలేరు. నేను ఈ ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నేను ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించడానికి ఇక్కడికి రాలేదు బావ. మిమ్మల్ని అందరిని జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చాను అని చంద్రకళ చెబుతుంది.
విరాట్ కాస్తా ముభావంగా ఉంటాడు. ఇదే సమయంలో చంద్రకళ వేలికి చిన్న గాయం అవుతుంది. దాంతో విరాట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడిగి గాయమైన దగ్గర ఆయింట్‌మెంట్ రాస్తూ ట్రీట్‌మెంట్ ఇస్తాడు. చూసావా బావ ప్రేమ అనేది చూపిస్తే రాదు గుండెల్లో నుంచి పుట్టాలి. నాకు గాయం అయిందంటే చంటి పిల్లాడిలా పరుగెత్తుకొంటూ వెళ్లి ఆయింట్‌మెంట్ తీసుకొచ్చి నా వేలికి రాశావు అని చంద్రకళ అంటుంది.
కామాక్షి మరియు శృతిల వ్యాపార వైఫల్యం
అక్కడితో చాలా ఫీల్ అయిపోయిన విరాట్ బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు హాల్లో కామాక్షి, శృతిల దగ్గరకు చంద్రకళ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు. తాళాలు నా చేతికి వచ్చాయని కోప్పడుతున్నారా అని చంద్రకళ అడుగుతుంది. కోపం వస్తుందని కామాక్షి చెబుతుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు ఇంటికి వస్తారు.
శ్రుతి, కామాక్షిని అడుగుతారు. వాళ్లు కొనుకెళ్లిన చీరలు చినిగిపోయాయని, చాలా నాసిరకం చీరలు అమ్మారని కామాక్షి, శృతిల మీద తెగ ఫైర్ అయి తిడతారు. వాళ్లు ఇచ్చిన డబ్బులు తల్లీకూతుళ్ల దగ్గర వసూలు చేసుకుని ఇంకోసారి ఇలాంటి బిజినెస్‌లు పెట్టొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు ఆ ఆడవాళ్లు. ఇక నుంచి అయిన మరో బిజినెస్ పెట్టడం ఆపేయండి అని చంద్రకళ అనేసి వెళ్లిపోతుంది.
అదంతా చూసిన విరాట్ ఒక బిజినెస్ పోతే మనం కృంగిపోకూడదు ఇంకోటి ప్రయత్నించాలి అని అంటాడు. ఇంతలో ఇంటికి గెస్టులు వస్తారు. వాళ్లు జగదీశ్వరి ఫ్రెండ్స్ అని, జగదీశ్వరిని చూసి, కలిసి చాలా కాలం అయిందని అంటారు. జగదీశ్వరితో చాలా ప్రేమగా వాళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు.
అమ్మవారి నగలు మరియు శాలిని యొక్క పన్నాగం
తర్వాత వాళ్లు జగదీశ్వరి ని ఒక సహాయం కోరుతారు. కచ్చితంగా చేస్తానని జగదీశ్వరి చెప్పడంతో గాయత్రి అమ్మవారికి నగలు సమర్పిస్తామని మొక్కు ఉందని, ఆ నగలు ఇక్కడికి తీసుకొచ్చామని, సాయంకాలం చీకటి పడటం వల్ల ఆ నగలని అమ్మవారికి సమర్పించలేకపోయామని చెబుతారు.
అయితే, రేపు కూడా నగలను తీసుకెళ్లాలి, ఈ నగలు పెట్టుకుని దూర ప్రయాణం చేయడం కష్టమని, ఈరోజుకి ఈ నగలని ఇక్కడే భద్రంగా ఉంచితే చాలని జగదీశ్వరిని అడుగుతారు తన ఫ్రెండ్స్. ఈ ఒక్క సహాయం చేయమని ప్రాధేయపడతారు. దాంతో జగదీశ్వరి తప్పకుండా చేస్తానని ఒప్పుకుని ఆ నగలు బాక్స్ తీసుకుంటుంది.
తర్వాత చంద్రకళకు నగలు ఇచ్చి భద్రంగా ఒక దగ్గర పెట్టమని చెబుతుంది జగదీశ్వరి. అలాగే అత్తయ్య అని ఆ నగల బాక్స్‌ను తీసుకుని జాగ్రత్తగా లాకర్‌లో పెడుతుంది చంద్రకళ. అయితే, ఆ నగలను దొంగలించి, అత్త జగదీశ్వరికి అవమానం కలిగేలా, ఆ నింద చంద్రకళ మీద పడేలా శాలిని కన్నింగ్ స్కెచ్ వేస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
అమ్మవారి నగల దొంగతనం వెనుక ఎవరున్నారో, చంద్రకళ నిజంగానే దోషియా కాదా అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ చూడాలి. విరాట్ చంద్రకళ ప్రేమ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూద్దాం.


