|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తల్లిదండ్రులకు క్లాస్ పీకి రవితో తిరిగి ఇంటికి వచ్చిన శృతి.. తల్లికి మనోజ్ షాక్

Published: 21-07-2025, 11:15 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తల్లిదండ్రులకు క్లాస్ పీకి రవితో తిరిగి ఇంటికి వచ్చిన శృతి.. తల్లికి మనోజ్ షాక్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని 471వ ఎపిసోడ్ లో శృతి తన తల్లిదండ్రులకు తన అనుభవాన్ని చెప్పింది. మనోజ్ గుడిలో అడుక్కుంటున్న సన్నివేశం మరియు బాలు, మీనా చేసిన ప్రయత్నాలు ఈ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మార్చాయి.

Key Points

1

శృతి తల్లిదండ్రులకు తన అనుభవాన్ని వివరిస్తుంది.

2

మనోజ్ గుడిలో అడుక్కుంటూ కనిపిస్తాడు.

4

ప్రభావతి మనోజ్‌ను చూసి షాక్ అవుతుంది.

శృతి ఇంటికి తిరిగి రావడం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జులై 22) 471వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా ఫన్నీగా సాగింది. తల్లిదండ్రులకు శృతి క్లాస్ పీకుతుంది. ఇటు మనోజ్ ను బాలు, మీనా బలవంతంగా ఇంటికి తీసుకురాగా.. అతన్ని చూసి ప్రభావతి షాక్ తింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ ఎపిసోడ్ శృతి తల్లిదండ్రులు శోభ, సురేంద్ర తమ అల్లుడు రవి గురించి మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. తమ అల్లుడిని తమ దగ్గరే పెట్టుకొని వ్యాపారం పెట్టిద్దామనుకొని ప్లాన్ చేస్తే.. అతడు వర్కర్స్ దగ్గర ఉంటున్నాడేంటి అని సురేంద్రతో అంటుంది శోభ. అల్లుడిగారి మనసు మారిపోయి శృతిని తీసుకెళ్తే ఎలా అంటుంది. అలా ఏమీ జరగదులే అని సురేంద్ర చెబుతాడు.

ఇంతలో శృతి ఇంటికి వచ్చి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో అని కంగారుగా వాళ్లు ఆమె దగ్గరికి వెళ్తారు. తన డబ్బింగ్ స్టూడియోలో జరిగిన విషయాన్ని, బాలు తనను ఎలా కాపాడాడో ఆమె చెబుతుంది. అయితే బాలు కావాలనే ఇలా చేశాడని సురేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో శృతి తన తండ్రిపై మండిపడుతుంది.

మనోజ్ యొక్క గుడి అనుభవం

అన్నింటినీ ఎందుకు అనుమానిస్తారని అంటుంది. నిన్ను తిరిగి తీసుకెళ్లడానికి ఇదో ప్లాన్ అని సురేంద్ర అనడంతో.. తమను ఆ ఇంటికి దూరం చేయడానికి మీరే బాలును రెచ్చగొట్టారని తనకూ అనుమానం వస్తోందని శృతి అంటుంది. దీంతో శోభ, సురేంద్ర షాక్ తింటారు.

అటు గుడి మెట్ల దగ్గర మనోజ్ .. స్వామిజీ చెప్పినట్లు ఒక రోజు అడుక్కుంటూ ఉంటాడు. అప్పటికే మీనా తనను చూడటంతో ఆమె ఎవరిని తీసుకొస్తుందో, తన దీక్ష జరుగుతుందో లేదో అని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలోనే బాలు అక్కడికి వస్తాడు. మనోజ్ అడుక్కోవడం తాను చూశానని చెప్పి అతన్ని గుడిలోకి తీసుకెళ్తుంది. అక్కడ మనోజ్ ను చూసి బాలు షాక్ తింటాడు. అన్ని డిగ్రీలు చదివి ఇలా అడుక్కోవడం ఏంట్రా అని తనదైన స్టైల్లో మనోజ్ కు క్లాస్ పీకుతాడు.

దీంతో మనోజ్ అసలు విషయం చెబుతాడు. కెనడా వెళ్లాలంటే కష్టపడాలి కానీ.. ఈరోజుల్లోనూ ఇలాంటి మూఢనమ్మకాలేంటి అతని బాలు మండిపడతాడు. ఇంటికి వెళ్దామని అంటాడు. కానీ మనోజ్ మాత్రం రానంటాడు. అయితే వీడియో కాల్ చేసి అమ్మకి, రోహిణికి చూపిస్తానని బాలు అంటాడు. దీంతో మనోజ్ తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే ఇంటికి వెళ్తాడు.

ప్రభావతికి షాక్

మనోజ్ ను అలా అడుక్కునే వాడి బట్టలతోనే ఇంటికి తీసుకెళ్తాడు బాలు. అతని బట్టలు కంపు కొడుతుండటంతో బాలు ఆటపట్టిస్తుంటాడు. తాను ఇలా ఇంట్లోకి రాలేనని మనోజ్ అంటాడు. ఇలా కారులోనే ఉంటే ఆ కంపుకు తనకు కస్టమర్లు కూడా ఎవరూ దొరకరని అంటూ బాలు అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తాడు. ముఖం కనిపించకుండా టవల్ కప్పుకొని ఇంట్లోకి వెళ్తాడు మనోజ్.

అతన్ని చూసి ఎవరో అడుక్కొచ్చే వాడిని ఎందుకు తీసుకొచ్చావంటూ ప్రభావతి.. బాలుపై మండిపడుతుంది. నానా మాటలు అంటుంది. మనోజ్ అని తెలియక అతన్ని చెడామడా తిట్టేస్తుంది. నిన్ను కాదు.. నీ అమ్మను అనాలి.. బయటకు వెళ్లు.. చద్దన్నం ఉంటే పడేస్తానని అంటుంది. బాలు చెబుతున్నా ఆగదు. చివరికి మనోజ్ తన ముఖం చూపించడంతో అతన్ని చూసి సత్యం, ప్రభావతి షాక్ తింటారు. అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఎపిసోడ్ చివర్లో రేపటి ఎపిసోడ్ కు సంబంధించి చిన్న ప్రోమో వేశారు. అందులో శృతిని ఇంటికి తీసుకెళ్లడానికి రవితో కలిసి బాలు వస్తాడు. అతన్ని చూసి సురేంద్ర, శోభ మండిపడుతుండగా.. అతన్ని తానే పిలిచానని, తన ఇంటికి వెళ్లిపోతానని శృతి స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత బాలు, రవితో కలిసి శృతి వెళ్లినట్లు చూపించారు. దీంతో రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ లో శృతి, మనోజ్ జీవితాలలో సంభవించే ఊహించని ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.