|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరిత్ర సృష్టించిన మోహన్‍‌లాల్ సినిమా.. నెల వ్యవధిలో స్టార్ హీరోకు రెండో బ్లాక్‍బస్టర్

Published: 10-05-2025, 8:13 AM
చరిత్ర సృష్టించిన మోహన్‍‌లాల్ సినిమా.. నెల వ్యవధిలో స్టార్ హీరోకు రెండో బ్లాక్‍బస్టర్

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన తుడరుమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేరళలో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుని చరిత్ర సృష్టించింది. నెల వ్యవధిలోనే మరో బ్లాక్ బస్టర్‌తో మోహన్లాల్ అభిమానులను అలరించాడు.

Key Points

1

మోహన్లాల్ నటించిన తుడరుమ్ సినిమా కేరళలో రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

2

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.182 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

4

తుడరుమ్ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించింది.

తుడరుమ్ సినిమా రికార్డులు

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన తుడరుమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కేరళలో భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. తెలుగులోనూ విడుదలైన ఈ మూవీకి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. తాజాగా తుడరుమ్ చిత్రం హిస్టరీ క్రియేట్ చేసింది.

తుడరుమ్ సినిమా చరిత్ర సృష్టించింది. కేరళలో రూ.100కోట్ల కలెక్షన్ల మార్క్ సాధించిన తొలి మూవీగా ఈ చిత్రం రికార్డు దక్కించుకుంది. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటి వరకు 2018 చిత్రం ఉండేది. ఆ మూవీ కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.89కోట్లను రాబట్టింది. ఇప్పుడు తడురుమ్ సినిమా ఆ రికార్డును బద్దలుకొట్టింది. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

మోహన్లాల్ సినిమాల విజయం

తుడరమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో సుమారు రూ.182 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. దీంతో రూ.200కోట్ల మార్క్ కూడా సులువే అనిపిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ అంచనాలకు మించిన వసూళ్లతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.

మోహన్‍లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ చిత్రం మార్చి 27న విడుదలైంది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.250కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, కేరళలో ఈ చిత్రానికి రూ.87కోట్లు దక్కాయి. 2018 సినిమాను దాటలేకపోయింది. అయితే, కేరళలో రూ.100కోట్ల మార్క్ సాధించి తుడరుమ్ రికార్డు సృష్టించింది. మోహన్‍లాల్‍కు నెల వ్యవధిలోనే ఎంపురాన్, తుడరుమ్ చిత్రాలతో రెండు భారీ బ్లాక్‍బస్టర్స్ దక్కాయి.

బాక్సాఫీస్ వసూళ్లు

తుడరుమ్ చిత్రాన్ని థ్రిల్లింగ్‍గా తెరకెక్కించారు డైరెక్టర్ తరుణ్ మూర్తి. ప్రేక్షకులను ఈ మూవీ చాలా మెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని రాజపుత్ర విజువల్ మీడియా పతాకంపై రెంజిత్ నిర్మించారు. మోహన్‍లాల్‍ తో పాటు శోభన, ప్రకాశ్ వర్మ, బినూ పప్పు, థామస్ మాథ్యూ, పర్హాన్ ఫాజిల్, అమృతవర్షిని, ఇర్షాద్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీకి షాజి కుమార్ సినిమాటోగ్రఫీ చేయగా.. నిషాద్ యూసుఫ్, షఫీక్ ఎడిటింగ్ చేశారు.

మొత్తంమీద, మోహన్లాల్ నటన, తుడరుమ్ చిత్రం కథ, దర్శకత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం మలయాళ సినీ పరిశ్రమకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.