
గుండె నిండా గుడి గంటలు సీరియల్ 501వ ఎపిసోడ్ లో బాలు మరియు మీనా పెళ్లి వేడుకలు ప్రధాన ఆకర్షణ. ప్రభావతి వంట విషయంలో సృష్టించిన గందరగోళం, మనోజ్ యొక్క కూరగాయల అనుభవం ఈ ఎపిసోడ్ కు హాస్యాన్ని జోడించాయి.
Key Points
బాలు, మీనా పెళ్లి రోజు వేడుకలు
ప్రభావతి వంట విషయంలో రచ్చ
మౌనికను పిలవద్దనే విషయం
బాలు, మీనా పెళ్లి వేడుకలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 501వ ఎపిసోడ్ లో బాలుకు మీనా క్లాస్ పీకుతుంది. అటు చివరికి మీనా తల్లి ఇంటికి రావడం, అందరూ కలిసి బాలు, మీనా పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేయడం లాంటి సీన్లు ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో చూద్దాం.
వంట విషయంలో ప్రభావతి రచ్చ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ వంట విషయంలో ప్రభావతి చేసే రచ్చతో మొదలవుతుంది. మీనాను పిలిచి మనోజ్, రోహిణిలకు ఇష్టమైన వంటే వండాలని ఆర్డర్ వేస్తుంది. వాళ్లకు నచ్చిన వంటే చేయాలా.. వాళ్ల వంట వాళ్లు చేసుకోలేరా తల్లిని బాలు నిలదీస్తాడు. వాళ్లు బిజినెస్ చేయబోతున్నారని, అంత టైమ్ వాళ్లకు లేదని ఆమె అంటుంది. తనకు వెజ్ బిర్యానీ కావాలని రోహిణి అనగానే ఆర్డర్ పెట్టుకో అని మీనా చెబుతుంది.
ఇంట్లో సొరకాయ తప్ప ఏమీ లేవని, కూరగాయలు లేకుండా బిర్యానీ ఎలా చేస్తామని ప్రశ్నిస్తుంది. వెళ్లి కూరగాయలు తీసుకురాపో అని బాలుకు ప్రభావతి చెబుతుంది. మనోజ్ గాడినే వెళ్లి తెచ్చుకోమని బాలు అంటాడు. వాడు కూరగాయలు తేవడమేంటి అని ప్రభావతి అనగానే.. బిజినెస్ చేయబోతున్నాడో బయట ఎలా ఉందో తెలియాలని సత్యం అంటాడు.
కూరగాయలకు కార్లో వెళ్లిన మనోజ్
సరే తానే వెళ్లి తెస్తాను కానీ డబ్బులు అని అడగడంతో రోహిణి వెళ్లి రూ.500 తెచ్చి ఇస్తుంది. బయటకు వచ్చిన మనోజ్ ఎండ ఎక్కువగా ఉందంటూ కారులో వెళ్తాడు. చాలాసేపైనా తిరిగి రాకపోవడంతో నీకు ఏమైనా కావాలంటే రెండు రోజుల ముందే చెప్పు రోహిణి.. వీడు ఈరోజు చెబితే ఎల్లుండి వస్తాడు అంటూ బాలు ఎగతాళి చేస్తాడు.
ప్రభావతి యొక్క వంటగది రచ్చ
తర్వాత మెల్లగా వచ్చిన మనోజ్ అన్ని కూరగాయలు తీసుకొచ్చానని చెబుతూ ఒక్క రూపాయి మిగిలిందని రోహిణికి ఇస్తాడు. ఈ మాత్రం కూరగాయలకు రూ.500 అవుతాయా.. రూ.200 కూడా కావని మీనా అంటుంది. బిజినెస్ చేయబోతున్నావ్.. కనీసం కూరగాయల బేరం కూడా ఆడలేవా అంటూ బాలు నిందిస్తాడు.
మనోజ్ పరువు తీసిన కూరగాయల వ్యక్తి
ఇంతలోనే కూరగాయల వ్యక్తి వచ్చి మనోజ్ పరువు తీస్తాడు. ఎవరు ఇతన్ని పంపించింది.. బిల్లు రూ.199 అయితే రూ.499గా తప్పు పడింది.. కనీసం రేట్లు కూడా అడగకుండా డబ్బులు ఇచ్చి వచ్చేశాడు.. పిలిచినా పట్టించుకోలేదు.. మరోసారి ఇతన్ని పంపించకండి అంటూ మిగిలిన డబ్బు ఇచ్చి వెళ్లిపోతాడు.
దీంతో మనోజ్ తో మరింత ఆడుకుంటాడు బాలు. నీ తప్పులను ఎంతని కవర్ చేయాలంటూ రోహిణి, ప్రభావతి కూడా అతన్ని తిడతారు. ఎవరి ముందు దొరకకూడదనుకుంటావో వాళ్ల ముందే దొరికిపోతావంటూ ప్రభావతి అంటుంది.
పెళ్లి రోజు మరచిపోయిన బాలు
ఇక ఆ తర్వాత ఇవాళ్టి సంగతి వదిలేయండి రేపు ఏం చేద్దామో ఆలోచించు అని బాలుతో అంటాడు సత్యం. రేపు ప్రత్యేకత ఏంటి.. వీడు డబ్బులు మింగి పారిపోయాడు అదేనా అని బాలు అంటాడు. దీంతో మీనా అలిగి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తర్వాత రేపు మీ పెళ్లి రోజురా అంటూ కొడుకు చెవి పట్టుకొని మందలిస్తాడు సత్యం. మీనా అలిగింది.. వెళ్లి బుజ్జగించు అని చెప్పి పంపిస్తాడు.
మనోజ్ మరియు కూరగాయల కథ
మీనా దగ్గరికి వెళ్లిన బాలు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తాను మరచిపోలేదని, అయిన తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేంత ఘనంగా జరిగిందా.. ఆ ముందు రోజే మనోజ్ గాడు డబ్బులు మింగేశాడు కాబట్టి అది గుర్తుందని ఏదేదో చెబుతాడు. నీ విషయంలో అసలు ఏదీ మరచిపోనని కూడా అంటాడు. కానీ మీనా మాత్రం వినదు.
అంతగా మీకు గుర్తుంటే తొలిసారి ఎక్కడ కలిశామో చెప్పమని అడుగుతుంది. బాలుకి అది కూడా గుర్తుండదు. దీంతో మీనానే చెబుతుంది. అలా పెళ్లికి ముందు తమ మధ్య జరిగిన ఘటనల గురించి మీనా గుర్తు చేస్తూ ఉంటుంది. బాలుకు ఏదీ గుర్తుండకపోవడంతో మీనా అతనికి క్లాస్ పీకుతూనే ఉంటుంది.
మీనా తల్లిని అవమానించిన ప్రభావతి
ఆ తర్వాత మీనా తల్లి ఇంటికి వస్తుంది. ఫోన్లో మాట్లాడుకున్నది సరిపోలేదా.. ఇంటికి వచ్చారని ఆమెను ప్రభావతి అవమానించేలా మాట్లాడుతుంది. కాఫీ పెట్టుకొని తీసుకురాపో అని మీనాకు చెబుతుంది. కాఫీ మీ అమ్మకు కాదు తనకు అని అనడంతో మీనాకు కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులకు ఇవ్వకుండా మనం తాగడం పద్ధతి కాదని క్లాస్ పీకుతుంది. సత్యం మాత్రం ఏంటి విశేషం ఇలా వచ్చారని అడగడంతో రేపు వీళ్ల పెళ్లి రోజు కదా.. ఇంటికి పిలిచి బట్టలు పెడదామనుకున్నానని అంటుంది.
వాళ్ల పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేద్దామని సత్యం, రవి, శృతి ప్లాన్ చేస్తారు. ఇంతలో సత్యం తల్లి సుశీల రావడంతో బాలు ఆమెను ఎత్తుకొని తిప్పుతాడు. మౌనికను కూడా పిలుద్దామనడంతో మీనా భయపడుతుంది. ఆమె పరిస్థితి గురించి తెలుస్తుందేమో అని కంగారుపడుతుంది. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు అని అడుగుతుంది. అంటే నా కూతురిని ఇంటికి పిలవడం ఇష్టం లేక ఇలా చేస్తున్నావా అంటూ ప్రభావతి కొత్త రచ్చకు తెరలేపడంతో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో బాలు, మీనా పెళ్లి సందడితో పాటు, ప్రభావతి, మనోజ్ మరియు మౌనిక చుట్టూ తిరిగే హాస్యభరితమైన సంఘటనలు ప్రేక్షకులను అలరించాయి. మరిన్ని ఉత్కంఠభరితమైన ఘటనల కోసం వేచి చూద్దాం.


